ఆధార్ సవరణ బిల్లుకు కేబినెట్ ఆమోదం
Sakshi Education
బ్యాంకు అకౌంట్లు తెరిచేందుకు, మొబైల్ ఫోన్ కనెక్షన్లు పొందేందుకు ఆధార్‌ను గుర్తింపు ధ్రువీకరణగా వాడుకునేందుకు వీలు కల్పిస్తూ రూపొందించిన ఆధార్ సవరణ బిల్లుకు కేంద్ర కేబినెట్ జూన్ 12న ఆమోదం తెలిపింది.
2019, మార్చిలో విడుదల చేసిన ఆర్డినెన్స్ స్థానంలో రూపొందించిన ఈ సవరణ బిల్లును జూన్ 17వ తేదీ నుంచి ప్రారంభమయ్యే పార్లమెంట్ సమావేశాల్లో ప్రవేశపెట్టనుంది. నిబంధనలు ఉల్లంఘించిన వారికి భారీ జరిమానాలను కూడా బిల్లులో ప్రతిపాదించింది. అదేవిధంగా, 18 ఏళ్లు నిండిన వారు బయోమెట్రిక్ గుర్తింపు విధానం నుంచి బయటికి వచ్చేందుకు వీలు కల్పించే ప్రతిపాదన కూడా ఉంది.
క్విక్ రివ్యూ :
ఏమిటి : ఆధార్ సవరణ బిల్లుకు ఆమోదం
ఎప్పుడు : జూన్ 12
ఎవరు : కేంద్ర కేబినెట్
క్విక్ రివ్యూ :
ఏమిటి : ఆధార్ సవరణ బిల్లుకు ఆమోదం
ఎప్పుడు : జూన్ 12
ఎవరు : కేంద్ర కేబినెట్
Published date : 13 Jun 2019 05:42PM