Skip to main content

అభిజిత్ బెనర్జీకి ఆర్థిక శాస్త్ర నోబెల్ ప్రదానం

భారత సంతతికి చెందిన అభిజిత్ బెనర్జీకి స్వీడన్ రాజు కార్ల్-16 గుస్తాఫ్ 2019 ఏడాదికి ఆర్థిక శాస్త్ర నోబెల్ బహుమతిని ప్రదానం చేశారు.
Current Affairsస్వీడన్ రాజధాని స్టాక్‌హోమ్‌లో డిసెంబర్ 10న పురస్కార ప్రదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. బెనర్జీ భార్య ఎస్తేర్ డఫ్లో సైతం ఈ విభాగంలోనే నోబెల్‌ను అందుకున్నారు. అవార్డు ప్రదాన కార్యక్రమంలో దంపతులిద్దరూ భారతీయ సంప్రదాయ వస్త్రధారణలో పాల్గొన్నారు.

2019 ఏడాదికి గానూ ఆర్థిక నోబెల్ పురస్కారాన్ని ముగ్గురికి ప్రకటించారు. అభిజిత్, ఆయన భార్య ఎస్తర్ డఫ్లో, మరో అమెరికన్ ఆర్థికవేత్త మైకేల్ క్రెమెర్‌లను సంయుక్తంగా ఈ అవార్డుకు ఎంపిక చేశారు. ప్రపంచవ్యాప్తంగా పేదరికాన్ని నిర్మూలించడానికి వినూత్న కోణంలో పరిశోధనలు చేసి ఆర్థిక రంగంలో విప్లవాత్మక మార్పుల్ని తెచ్చినందుకు ఈ ముగ్గిరికి ఆర్థిక నోబెల్ దక్కింది.

చదవండి : అర్థశాస్త్రంలో ముగ్గురికి నోబెల్

క్విక్ రివ్యూ :
ఏమిటి
: అభిజిత్ బెనర్జీకి ఆర్థిక శాస్త్ర నోబెల్ ప్రదానం
ఎప్పుడు : డిసెంబర్ 10
ఎవరు : స్వీడన్ రాజు కార్ల్-16 గుస్తాఫ్
ఎక్కడ : స్టాక్‌హోమ్, స్వీడన్
Published date : 11 Dec 2019 05:51PM

Photo Stories