Skip to main content

83 తేజస్ యుద్ధ విమానాల కోసం ప్రభుత్వం ఏ కంపెనీతో ఒప్పందం చేసుకుంది?

83 తేజస్ ఎంకే1ఏ లైట్ కాంబాట్ ఎయిర్‌క్రాఫ్ట్‌ల(ఎల్‌సీఏ)లను కొనుగోలు చేయాలని భారత ప్రభుత్వం నిర్ణయించింది.
Current Affairs
ఇందుకు సంబంధించి ప్రభుత్వ దిగ్గజ సంస్థ హిందుస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్(హెచ్‌ఏఎల్)తో ఒప్పందం చేసుకుంది. హెచ్‌ఏఎల్ ఎండీ ఆర్.మాధవన్‌కు రక్షణ శాఖ డెరైక్టర్ జనరల్ వి.ఎల్.కాంతారావు ఒప్పంద పత్రాలను అందజేశారు. బెంగళూరులో జరుగుతున్న ‘‘ఏరో ఇండియా వైమానిక ప్రదర్శన-2021’’ సందర్భంగా ఫిబ్రవరి 3న రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ సమక్షంలో.... ఈ ఒప్పందం జరిగింది. ఈ ఒప్పందం విలువ రూ.48వేల కోట్లు. భారత రక్షణ కాంట్రాక్టుల విషయంలో ‘మేక్ ఇన్ ఇండియా’లో ఇదే అతిపెద్ద ఒప్పందమని నిపుణులు చెబుతున్నారు.

తేజస్ యుద్ధ విమానాన్ని భారత ఏరోనాటికల్ డెవలప్‌మెంట్ ఏజెన్సీ (ఎడిఎ), హెచ్‌ఏఎల్ సంస్థలు సంయుక్తంగా రూపొందించాయి. వయసు పైబడుతున్న మిగ్ -21 యుద్ధ విమానాల స్థానాన్ని పూరించేందుకు... 1980 లలో మొదలుపెట్టిన లైట్ కంబాట్ ఎయిర్‌క్రాఫ్ట్ (ఎల్‌సీఏ) కార్యక్రమంలో భాగంగా రూపుదిద్దుకున్న విమానమే తేజస్. 2003 ఏడాదిలో ఈ యుద్ధవిమానానికి అధికారికంగా ‘తేజస్‌‘ అని పేరు పెట్టారు.

క్విక్ రివ్యూ :

ఏమిటి : హిందుస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్(హెచ్‌ఏఎల్)తో ఒప్పందం
ఎప్పుడు : ఫిబ్రవరి 3
ఎవరు : భారత ప్రభుత్వం
ఎక్కడ : బెంగళూరు, కర్ణాటక
ఎందుకు : 83 తేజస్ ఎంకే1ఏ లైట్ కాంబాట్ ఎయిర్‌క్రాఫ్ట్‌ల(ఎల్‌సీఏ)లను కొనుగోలు చేయడానికి
Published date : 04 Feb 2021 06:13PM

Photo Stories