Skip to main content

79వ భారత చట్టసభల అధ్యక్షుల సదస్సు ముగింపు

ఉత్తరాఖండ్ రాజధాని డెహ్రాడూన్‌లో డిసెంబర్ 18న ప్రారంభమైన 79వ అఖిల భారత చట్టసభల అధ్యక్షుల(ప్రిసైడింగ్ అధికారుల) సదస్సు డిసెంబర్ 19న ముగిసింది.
Current Affairsఈ సదస్సులో లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా మాట్లాడుతూ... చట్టసభల్ని నడిపించే స్పీకర్లు తటస్థంగా వ్యవహరించాలని, ఫిరాయింపుదార్ల ఆటకట్టించేలా నిర్ణీత కాలవ్యవధిలో నిష్పక్షపాతంగా నిర్ణయాలు తీసుకోవాలని అన్నారు. ఫిరాయింపుల నిరోధక చట్టంలోని లొసుగుల్ని సమీక్షించడానికి కొన్ని రాష్ట్రాల శాసనసభ స్పీకర్లతో ఒక కమిటీ ఏర్పడిందని, త్వరలోనే అది తన నివేదికను సమర్పిస్తుందని చెప్పారు. ఈ సదస్సులో పాల్గొన్న ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారాం ‘ఫిరాయింపుల నిరోధక చట్టం-సంస్కరణల ఆవశ్యకత’ అనే అంశంపై ప్రసంగించారు.

క్విక్ రివ్యూ :
ఏమిటి :
9వ అఖిల భారత చట్టసభల అధ్యక్షుల(ప్రిసైడింగ్ అధికారుల) సదస్సు ముగింపు
ఎప్పుడు : డిసెంబర్ 19
ఎక్కడ : డెహ్రాడూన్, ఉత్తరాఖండ్
Published date : 20 Dec 2019 05:54PM

Photo Stories