7 వేల ఏళ్ల నాటి రాతి ఆయుధం బయల్పడిన ప్రాంతం?
Sakshi Education
తమిళనాడులోని దిండిగల్ జిల్లా పలని షణ్ముఖ నదీతీరంలో సుమారు 7 వేల సంవత్సరాల క్రితం నాటి రాతి ఆయుధం బయల్పడింది.
పురాతత్వ పరిశోధన బృందం జరిపిన తవ్వకాల్లో ఆ ఆయుధం పగిలిన స్థితిలో లభ్యమైంది. ప్రస్తుతం లభించిన రాతి ఆయుధం.. కొత్త రాతి యుగానికి చెందినదనిపురాతత్వ శాస్త్రవేత్త నారాయణ మూర్తి తెలిపారు. దీనిపై ప్రాచీన తమిళ లిపి చెక్కి ఉందని, పైభాగంలో 8 అక్షరాలు కింది భాగంలో 5 అక్షరాలు ఉన్నట్లు వెల్లడించారు. దీనిపై తెన్నాన్ అని రాసి ఉండడం వల్ల ఈ ఆయుధం తెన్నాడన్‌కు సంబంధించి అయి ఉంటుందని భావిస్తున్నట్లు వెల్లడించారు. తమిళ లిపి ప్రాచీతమైందని చెప్పేందుకు ఈ రాతి ఆయుధం ముఖ్య సాక్ష్యంగా ఉపయోగపడుతుందని ఆయన స్పష్టం చేశారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : 7 వేల ఏళ్ల నాటి రాతి ఆయుధం బయల్పడిన ప్రాంతం?
ఎప్పుడు : మే 31
ఎక్కడ : పలని షణ్ముఖ నదీతీరం, దిండిగల్ జిల్లా, తమిళనాడు
ఎందుకు :పురాతత్వ పరిశోధన బృందం జరిపిన తవ్వకాల్లో...క్విక్ రివ్యూ :
ఏమిటి : 7 వేల ఏళ్ల నాటి రాతి ఆయుధం బయల్పడిన ప్రాంతం?
ఎప్పుడు : మే 31
ఎక్కడ : పలని షణ్ముఖ నదీతీరం, దిండిగల్ జిల్లా, తమిళనాడు
Published date : 02 Jun 2021 06:34PM