Skip to main content

6 వేల కోట్లతో అటల్ భూజల్ యోజన అమలు

ఐదేళ్లపాటు ఏడు రాష్ట్రాల్లో అమలయ్యే కేంద్ర ప్రాయోజిత పథకం ‘అటల్ భూజల్ (అటల్ జల్) యోజన’ను రూ. 6 వేల కోట్లతో అమలు చేసేందుకు కేంద్ర కేబినెట్ డిసెంబర్ 24న ఆమోదం తెలిపింది.
Current Affairsసామాజిక భాగస్వామ్యంతో భూగర్భ జలాల యాజమాన్యం కోసం ఈ పథకాన్ని రూపొందించారు. గుజరాత్, హరియాణా, కర్ణాటక, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, రాజస్థాన్, ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్రాల్లో ఈ పథకాన్ని అమలు చేయనున్నారు.

స్వదేశ్ దర్శన్ ప్రాజెక్టులకు నిధులు
స్వదేశ్ దర్శన్ పథకంలో భాగంగా పలు ప్రాజెక్టులకు నిధులను మంజూరు చేసేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. 2019-20 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి కొత్త ప్రాజెక్టులకు గాను అదనంగా రూ. 1854.67 కోట్లను మంజూరు చేసేందుకు అంగీకరించింది. దేశాన్ని అంతర్జాతీయస్థాయి పర్యాటక కేంద్రంగా మార్చేందుకు వీలుగా పర్యాటక మౌలిక వసతుల స్థాపన ఈ పథకం ముఖ్య ఉద్దేశం. ఈ స్కీమ్‌లో మొత్తం 15 సర్క్యూట్లు ఉన్నాయి.

రైల్వేలో సంస్థాగత మార్పులు
భారతీయ రైల్వే సంస్థాగత పునర్నిర్మాణానికి కేబినెట్ ఆమోదం తెలిపింది. సంస్థాగత పునర్నిర్మాణంలో భాగంగా రైల్వే విభాగానికి సంబంధించి ఎనిమిది గ్రూప్-ఏ సర్వీసులను ఏకీకృతం చేసి ఇండియన్ రైల్వే మేనేజ్‌మెంట్ సర్వీసెస్(ఐఆర్‌ఎంఎస్)గా పరిగణిస్తారు. రైల్వే బోర్డును పునర్ వ్యవస్థీకరించనున్నారు. ఇకపై రైల్వే బోర్డు ఛైర్మన్ నేతృత్వంలో నలుగురు సభ్యులు, ఇద్దరు స్వతంత్ర సభ్యులు ఉంటారు. ఇండియన్ రైల్వే మెడికల్ సర్వీసెస్‌ను ఇండియన్ రైల్వే హెల్త్ సర్వీసెస్(ఐఆర్‌హెచ్‌ఎస్)గా మార్చనున్నారు.

క్విక్ రివ్యూ :
ఏమిటి :
6 వేల కోట్లతో అటల్ భూజల్ యోజన అమలు
ఎప్పుడు : డిసెంబర్ 24
ఎవరు : కేంద్ర కేబినెట్
ఎక్కడ : గుజరాత్, హరియాణా, కర్ణాటక, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, రాజస్థాన్, ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్రాల్లో
ఎందుకు : సామాజిక భాగస్వామ్యంతో భూగర్భ జలాల యాజమాన్యం కోసం
Published date : 25 Dec 2019 05:50PM

Photo Stories