Skip to main content

2026 శీతాకాల ఒలింపిక్స్‌కు ఇటలీ ఆతిథ్యం

2026లో జరగనున్న శీతాకాల ఒలింపిక్స్, పారా ఒలింపిక్స్‌కు ఇటలీ ఆతిథ్యం ఇవ్వనుంది.
ఈ మేరకు అంతర్జాతీయ ఒలింపిక్స్ కమిటీ(ఐఓసీ) అధ్యక్షుడు థామస్ బక్ జూన్ 25న ప్రకటించారు. ఈ క్రీడల ఆతిథ్యం కోసం ఇటలీ, స్వీడన్ బిడ్ దాఖలు చేయగా, ఎక్కువ మంది ఐఓసీ సభ్యులు ఇటలీకే ఓటేశారు. 2026 ఏడాది ఫిబ్రవరి 6 నుంచి 22 వరకు వింటర్ ఒలింపిక్స్, మార్చి 6 నుంచి 15 వరకు వింటర్ పారాలింపిక్స్ జరగనున్నాయి. ఇటలీలోని మిలానో, కార్టినా నగరాల్లో వీటిని నిర్వహించనున్నారు. ఇప్పటివరకు ఇటలీ రెండుసార్లు 1956, 2006లో వింటర్ ఒలింపిక్స్‌ను నిర్వహించింది.

క్విక్ రివ్యూ :
ఏమిటి :
2026 శీతాకాల ఒలింపిక్స్‌కు ఇటలీ ఆతిథ్యం
ఎప్పుడు : జూన్ 25
ఎవరు : అంతర్జాతీయ ఒలింపిక్స్ కమిటీ(ఐఓసీ) అధ్యక్షుడు థామస్ బక్
ఎక్కడ : ఇటలీలోని మిలానో, కార్టినా నగరాల్లో
Published date : 26 Jun 2019 06:05PM

Photo Stories