Skip to main content

2021లో గగన్‌యాన్‌ ప్రయోగం, కనీస మద్దతు ధరకు రూ.లక్షా 72వేల కోట్లు

భార‌త్ నిర్వహించ‌నున్న ప్ర‌తిష్టాత్మక మానవసహిత అంత‌రిక్ష ప్రయోగం "గ‌గ‌న్‌యాన్‌" 2021 ఉంటుంద‌ని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్ 2021-22 బ‌డ్జెట్ ప్రసంగంలో వెల్లడించారు.
Current Affairs

గగన్‌యాన్‌ కోసం రష్యాలో నలుగురు భారత వ్యోమగాములు శిక్షణ పొందుతున్నార‌ని తెలిపారు. దేశవ్యాప్తంగా ఐదు వ్యవసాయ హబ్‌లు ఏర్పాటు చేస్తామ‌న్నారు.
వ్యవసాయ రుణాల లక్ష్యం రూ.16.5లక్షల కోట్లుగా నిర్దేశించిన‌ట్లు పేర్కొన్నారు. 1000 మండీలను ఈనామ్‌తో అనుసంధానం చేయ‌నున్న‌ట్లు మంత్రి తెలిపారు. తేయాకు తోటల కార్మికుల కోసం రూ.1000కోట్లు కేటాయించిన‌ట్లు వివ‌రించారు.

బ‌డ్జెట్ ప్రసంగం-ముఖ్యాంశాలు

  • విద్యుత్‌ రంగానికి రూ.3.05 లక్షల కోట్లు కేటాయింపు.
  • కార్యాలయాల్లో రాత్రి వేళల్లో విధులు నిర్వహించే మహిళలకు పూర్తి రక్షణ
  • భవన నిర్మాణ కార్మికుల కోసం ప్ర‌త్యేక పోర్టల్‌
  • సామాజిక భద్రత పథకాల్లోకి వీధి వ్యాపారులు
  • గోవా డైమండ్ జూబ్లీ ఉత్సవాలకు రూ.300కోట్లు
  • డిజిటల్‌ చెల్లింపుల ప్రోత్సాహానికి రూ.1,500కోట్లు
  • డిజిటల్‌ విధానంలో జనాభా లెక్కలు

రైతుల సంక్షేమం
  • రైతుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది
  • రైతుల ఉత్పత్తుల్లో భారీగా పెరుగుదల ఉంది
  • వ్య‌వ‌సాయ సంస్కరణలకు మా ప్రభుత్వం కట్టుబడి ఉంది
  • వ్యవసాయ రంగానికి భారీగా నిధులు కేటాయింపు
  • 2021-22లో ఆహార ఉత్పత్తుల సేకరణ
  • కనీస మద్దతు ధరకు రూ.లక్షా 72వేల కోట్లు ఖర్చు అవుతుందని అంచనా
  • 2020-21లో రైతులకు రూ.75వేల కోట్లు కేటాయించాం
  • తద్వారా 1.5 కోట్ల మంది రైతులు లబ్ధి పొందారు
  • రైతు రుణాల లక్ష్యం రూ.16.5 లక్షల కోట్లు
Published date : 01 Feb 2021 12:41PM

Photo Stories