2021 ఏడాదిలో ప్రీమియర్ హ్యాండ్‌బాల్ లీగ్
Sakshi Education
కరోనా వైరస్ కారణంగా<b> ప్రీమియర్ హ్యాండ్‌బాల్ లీగ్ (పీహెచ్ఎల్)</b> ఆరంభ సీజన్ 2021 ఏడాదికి వాయిదా పడింది.
ఆటగాళ్ల ఆరోగ్య భద్రత దృష్ట్యా ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్లు భారత హ్యాండ్‌బాల్ సమాఖ్య (హెచ్‌ఎఫ్‌ఐ) ఉపాధ్యక్షుడు ఆనందీశ్వర్ పాండే డిసెంబర్ 18న ప్రకటించారు. కొత్త తేదీలపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని చెప్పారు. ప్రస్తుతం హెచ్‌ఎఫ్‌ఐ అధ్యక్షుడిగా అరిశెనపల్లి జగన్మోహన్ రావు, పీహెచ్‌ఎల్ సీఈవోగా మృణాలిని శర్మ ఉన్నారు.
షేడ్యూల్ ప్రకారం... రాజస్థాన్ రాజధాని జైపూర్‌లోని సవాయ్ మాన్‌సింగ్ ఇండోర్ స్టేడియంలో డిసెంబర్ 24 నుంచి జనవరి 10 వరకు పీహెచ్‌ఎల్ జరగాల్సి ఉంది. ఆరంభ సీజన్‌లో తెలంగాణ టైగర్స్, యూపీ ఐకాన్స్, మహారాష్ట్ర హ్యాండ్‌బాల్ హాస్లర్స్, కింగ్‌హ్యాక్స్ రాజస్తాన్, బెంగాల్ బ్లూస్, పంజాబ్ పిట్‌బుల్స్ జట్లు తలపడనున్నాయి.
క్విక్ రివ్యూ :
ఏమిటి : 2021 ఏడాదికి ప్రీమియర్ హ్యాండ్‌బాల్ లీగ్ (పీహెచ్‌ఎల్) వాయిదా
ఎప్పుడు : డిసెంబర్ 18
ఎవరు : భారత హ్యాండ్‌బాల్ సమాఖ్య (హెచ్‌ఎఫ్‌ఐ)
ఎందుకు : కరోనా వైరస్ కారణంగా

Published date : 19 Dec 2020 07:17PM