2020లో ఆసియా వృద్ధి జీరో: ఐఎంఎఫ్
Sakshi Education
కోవిడ్–19 నేపథ్యంలో 2020లో ఆసియా వృద్ధిరేటు ‘జీరో’గా ఉండే అవకాశాలు ఉన్నాయని అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్) అంచనా వేసింది.
దాదాపు 60 సంవత్సరాల్లో ఎప్పుడూ చూడని పరిస్థితి ఇదని పేర్కొంది. అయితే ఆర్థిక క్రియాశీలత విషయంలో ఇతర ఖండాలతో పోల్చితే ఆసియా పరిస్థితి మెరుగ్గానే ఉండే వీలుందని కూడా ఐఎంఎఫ్ పేర్కొంది. ‘‘కోవిడ్–19 మహమ్మారి– ఆసియా–పసిఫిక్ ప్రాంతం’ అన్న శీర్షికతో ఒక బ్లాక్‌లో ఐఎంఎఫ్ ఈ వివరాలను వెల్లడించింది. కరోనా వైరస్ ప్రభావం ఆసియాలో తీవ్రంగా, మునుపెన్నడూ లేని విధంగా ఉంటుందని ఐఎంఎఫ్ పేర్కొంది. 1997 ఆసియన్ ఫైనాన్షియల్ సంక్షోభంలో వృద్ధి ఆసియా వృద్ధి 1.3 శాతంగా ఉంటే, 2008 అంతర్జాతీయ ఆర్థిక సంక్షోభ పరిస్థితుల్లోనూ ఈ ప్రాంతంలో ఆర్థిక వృద్ధిరేటు 4.7 శాతంగా ఉన్న విషయాన్ని ఐఎంఎఫ్ ప్రస్తావించింది.
క్విక్ రివ్యూ :
ఏమిటి : 2020లో ఆసియా వృద్ధి జీరో
ఎప్పుడు : ఏప్రిల్ 16
ఎవరు : అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్)
ఎందుకు : కోవిడ్–19 నేపథ్యంలో
క్విక్ రివ్యూ :
ఏమిటి : 2020లో ఆసియా వృద్ధి జీరో
ఎప్పుడు : ఏప్రిల్ 16
ఎవరు : అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్)
ఎందుకు : కోవిడ్–19 నేపథ్యంలో
Published date : 17 Apr 2020 06:43PM