Skip to main content

2020-21 పంట ఏడాదికి గోధుమ కనీస మద్దతు ధర ఎంత?

2020-21 పంట సంవత్సరానికి(జూన్-జూలై), 2021-22 మార్కెటింగ్ సీజన్‌కు గోధుమ సహా ఆరు రబీ పంటల కనీస మద్దతు ధర(ఎంఎస్పీ)ను 6 శాతం వరకు పెంచుతూ కేంద్రప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
Edu newsఆరు రబీ పంటల ఎంఎస్పీ పెంపును ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ ఆమోదించిందని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ సెప్టెంబర్ 21న లోక్‌సభకు తెలిపారు. మంత్రి తెలిపిన వివరాల ప్రకారం...
  • గోధుమ కనీస మద్దతు ధరను క్వింటాల్‌కు రూ. 50 పెంచారు. దాంతో క్వింటాల్ గోధుమ ఎంఎస్పీ రూ. 1,975కి చేరింది.
  • బార్లీ కనీస మద్దతు ధరను క్వింటాల్‌కు రూ.75 పెంచారు. దాంతో క్వింటాల్ బార్లీ ధర రూ.1,600కు చేరింది.
  • ఎంఎస్పీ రూ.225 పెరగడంతో, కందుల ధర క్వింటాల్‌కు రూ. 5,100కి చేరింది.
  • మసూర్‌దాల్ ధర క్వింటాల్‌కు రూ.300 పెరిగింది. దాంతో వాటి ధర క్వింటాల్‌కు రూ. 5,100కి చేరింది.
  • ఆవాల ధర క్వింటాల్‌కు రూ.225 పెరిగి, రూ. 4,650కి చేరింది.
  • కుసుమల ధర క్వింటాల్‌కు రూ.112 పెరిగి, రూ.5,327కి చేరింది.
క్విక్ రివ్యూ :
ఏమిటి : 2020-21 పంట ఏడాదికి గోధుమ సహా ఆరు రబీ పంటల కనీస మద్దతు ధర(ఎంఎస్పీ) పెంపు
ఎప్పుడు : సెప్టెంబర్ 21
ఎవరు : ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ
Published date : 23 Sep 2020 06:35PM

Photo Stories