Skip to main content

2020-21 బడ్జెట్ పత్రాల ముద్రణ ప్రారంభం

సాంప్రదాయక హల్వా రుచుల ఆస్వాదనతో వచ్చే ఆర్థిక సంవత్సరం (2020-2021) బడ్జెట్ పత్రాల ముద్రణ ప్రక్రియ జనవరి 20న ప్రారంభమైంది.
Current Affairsఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్, సహాయమంత్రి అనురాగ్ ఠాకూర్, ఫైనాన్స్ కార్యదర్శి రాజీవ్ కుమార్, రెవెన్యూ సెక్రటరీ అజయ్ భూషణ్ పాండే, ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి అతను చక్రవర్తి ‘బడ్జెట్ హల్వా ఉత్సవం’ కార్యక్రమంలో పాల్గొన్నారు. 2020, ఫిబ్రవరి 1వ తేదీన సీతారామన్ 2020-21 ఫైనాన్స్ బిల్లును లోక్‌సభలో ప్రవేశపెట్టనున్నారు. నరేంద్ర మోదీ రెండవసారి ప్రధానిగా అధికార పగ్గాలు చేపట్టిన తర్వాత సమర్పిస్తున్న రెండవ బడ్జెట్ ఇది.

బడ్జెట్ హల్వా ఉత్సవం భాగంగా పెద్ద కడాయిలో హల్వాను తయారు చేసి, ఆర్థిక శాఖ ఉన్నతాధికారులకు, బడ్జెట్ తయారీకి సంబంధించిన సిబ్బందికి వడ్డించారు. ఈ సిబ్బంది... బడ్జెట్ తయారీ నుంచి లోక్‌సభలో ప్రవేశపెట్టేవరకూ ఆర్థిక మంత్రిత్వ శాఖ భవనంలోనే ఉంటారు. బయటి ప్రపంచంతో వారికి ఎలాంటి సంబంధాలు ఉండవు. పలువురు ఉన్నతాధికారులకు మాత్రమే ఇంటికి వెళ్లడానికి అనుమతి ఉంటుంది.

క్విక్ రివ్యూ :
ఏమిటి
: 2020-21 బడ్జెట్ పత్రాల ముద్రణ ప్రారంభం
ఎప్పుడు : జనవరి 20
ఎవరు : కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్
ఎక్కడ : న్యూఢిల్లీ

మాదిరి ప్రశ్నలు

1. 1947 నవంబర్ 26వ తేదీన భారత్ తొలి బడ్జెట్‌ను ఎవరు ప్రవేశపెట్టారు?
1. సర్వేపల్లి రాధాకృష్ణన్
2. జవహర్ లాల్ నెహ్రు
3. మొరార్జీ దేశాయ్
4. ఆర్‌కే షణ్ముకం శెట్టి

Published date : 21 Jan 2020 06:28PM

Photo Stories