Skip to main content

Sainik School Admissions: సైనిక్‌ స్కూల్‌లో ప్రవేశాలకు రేపు పరీక్ష

ఖమ్మం మయూరి సెంటర్‌: కరీంనగర్‌ జిల్లా రుక్మాపూర్‌లోని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ సైనిక్‌ స్కూల్‌, కళాశాలలో ప్రవేశాలకు మార్చి 10వ తేదీన పరీక్ష నిర్వహించనున్నారు.
Sainik School Admission Test Tomorrow   Telangana Social Welfare Gurukula Vidyalayas

ఆరో తరగతి, ఇంటర్‌ మొదటి సంవత్సరంలో ప్రవేశాలకు ఈ పరీక్ష ఉంటుందని ఖమ్మం ఆర్సీఓ ప్రత్యూష తెలి పారు.

ఖమ్మంలోని సాంఘిక సంక్షేమ గురుకుల అంబేద్కర్‌ జూనియర్‌ కళాశాల, సాంఘిక సంక్షేమ గురుకుల టేకులపల్లి జూనియర్‌ కళాశాల, భద్రాద్రి జిల్లాలోని పాల్వంచ బాలికల గురుకుల జూనియర్‌ కళా శాల, మహబూబాబాద్‌లోని గురుకుల జూనియర్‌ కళాశాలలో పరీక్షా కేంద్రాలు ఏర్పాటుచేసినట్లు వెల్లడించారు. ఆరో తరగతి ప్రవేశపరీక్ష ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు, ఇంటర్‌ ప్రవేశపరీక్ష ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు జరుగుతుందని తెలిపారు.

చదవండి: టిఎస్ టెన్త్ క్లాస్ - మోడల్ పేపర్స్ 2024 | టైం టేబుల్ 2024 | స్టడీ మెటీరియల్ | గైడెన్స్ | సిలబస్ | బిట్ బ్యాంక్ | మోడల్ పేపర్స్ | ప్రీవియస్ పేపర్స్ | టెక్స్ట్ బుక్స్ | ఏపీ టెన్త్ క్లాస్

Published date : 09 Mar 2024 05:55PM

Photo Stories