Skip to main content

AP EAPCET 2025 Seat Allotment Postponed: ఫైనల్ ఫేజ్ సీటు కేటాయింపు వాయిదా... ఎందుకంటే

ఏపీ ఈఏపీ‌సెట్‌–2025 ఎంఫీసీ స్ట్రీమ్‌ ఫైనల్‌ ఫేజ్‌ వెబ్‌ కౌన్సెలింగ్‌ ద్వారా బీ.ఫార్మసీ/ఫార్మ్‌-డి కోర్సుల అడ్మిషన్ల కోసం జూలై 27 నుంచి ఆగస్టు 1, 2025 వరకు కౌన్సెలింగ్‌ నిర్వహించారు. సీటు కేటాయింపులు ఆగస్టు 4న విడుదల కావాల్సి ఉంది. అయితే, ఆంధ్రప్రదేశ్‌ స్టేట్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ హయ్యర్‌ ఎడ్యుకేషన్‌ (APSCHE) తాజా ప్రకటనలో తెలిపిన వివరాల ప్రకారం, ఫైనల్‌ ఫేజ్‌ ఇంజనీరింగ్‌ సీటు కేటాయింపు వాయిదా పడింది.
AP EAPCET 2025 final phase seat allotment today   AP EAPCET 2025 M.Pharmacy final phase counseling update EngineeringAdmissions

APSCHE వెబ్‌సైట్‌లో "గౌరవ హైకోర్టు ఆదేశాల కారణంగా సీటు కేటాయింపులు వాయిదా వేయబడ్డాయి. గౌరవ హైకోర్టు ఆదేశాల ప్రకారం కేటాయింపు తేదీని త్వరలో తెలియజేస్తాము" అని సందేశం ప్రదర్శించారు.

ఈ కౌన్సెలింగ్‌లో అర్హత సాధించిన అభ్యర్థులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని యూనివర్సిటీ, ప్రైవేట్ ఇంజినీరింగ్ కళాశాలలు మరియు ప్రైవేట్ విశ్వవిద్యాలయాల్లో కన్వీనర్ కోటా సీట్ల కోసం పాల్గొన్నారు.

ఇదీ చదవండి :TG EAPCET 2025 ఫైనల్‌ ఫేజ్‌ కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌ – ఇంజినీరింగ్‌ (MPC) అడ్మిషన్లకు చివరి అవకాశం

AP EAPCET 2025 ఫైనల్ ఫేజ్ సీటు కేటాయింపు – ఎలా చెక్ చేసుకోవాలి?

  1. అధికారిక వెబ్‌సైట్‌కి వెళ్లండి  https://eapcet-sche.aptonline.in/EAPCET/
  2. మీ లాగిన్ క్రెడెన్షియల్స్ (హాల్ టికెట్ నంబర్, పాస్‌వర్డ్‌) ఎంటర్ చేయండి
  3. సీటు కేటాయింపు స్థితి (Allotment Status) చెక్ చేసుకోండి
  4. అలాట్‌మెంట్ అక్‌నాలెడ్జ్‌మెంట్ స్లిప్ డౌన్‌లోడ్ చేసి ప్రింట్ తీసుకోండి

AP EAPCET 2025 ఫైనల్ ఫేజ్ తర్వాత ఏమి చేయాలి?

  • సెల్ఫ్-జాయినింగ్ & అలాట్ అయిన కాలేజీల్లో రిపోర్టింగ్: 04-08-2025 నుండి 08-08-2025 వరకు
  • క్లాస్‌వర్క్ ప్రారంభం: 04-08-2025

Follow our YouTube Channel (Click Here)

 Follow our Instagram Page (Click Here)

 Join our WhatsApp Channel (Click Here)

 Join our Telegram Channel (Click Here)

Published date : 05 Aug 2025 10:21AM

Photo Stories

News Hub