Telangana Inter Results 2024 Live Updates : ఏపీలో ఇంటర్ ఫలితాలు 2024 విడుదల.. ఇక తెలంగాణలో రిజల్డ్స్ ఎప్పుడంటే..?
ఇప్పటికే తెలంగాణలో ఇంటర్ సమాధాన పత్రాల మూల్యాంకన ప్రక్రియ ఇప్పటికే పూర్తయింది. మార్కుల జాబితా సక్రమంగా ఉందా? సాంకేతికపరమైన సమస్యలున్నాయా? అనే అంశాలను ఒకటికి రెండు సార్లు ఉన్నతాధికారులు పరిశీలిస్తున్నారు. అలాగే దీంతో పాటు వ్యాల్యూయేషన్‌లో వచ్చిన మార్కులను కూడా ఆన్‌లైన్‌లో నమోదు చేస్తున్నారు.
☛ AP Inter 1st, 2nd Year Results 2024 కోసం క్లిక్ చేయండి
ఏప్రిల్ 21వ తేదీ నాటికే..
ఈ ప్రక్రియకు వారం రోజులు పాటు సమయం పట్టే అవకాశం ఉందని చెపుతున్నారు. పరీక్ష రాసిన వారు, గైర్హాజరైన వారు, మాల్ ప్రాక్టీసింగ్‌కు పాల్పడిన విద్యార్థుల డేటాను కంప్యూటరీకరించాల్సి ఉంటుంది.
ఈ ప్రక్రియ మొత్తం ఏప్రిల్ 21వ తేదీ నాటికే ముగించాలని అధికారులు భావిస్తున్నారు. అని సానుకులంగా కుదిరితే.. తెలంగాణ ఇంటర్మీడియెట్ మొదటి, ద్వితీయ సంవత్సరం పరీక్షల ఫలితాలను ఒకేసారి ఏప్రిల్ 22వ తేదీ నుంచి ఏప్రిల్ 25వ తేదీలోపు ఏక్షణంలోనైన విడుదల చేయనున్నారు.
సాక్షిఎడ్యుకేషన్.కామ్‌లో ఫలితాలు..
ఈ సారి ఆంధ్రప్రదేశ్ ఇంటర్ ఫస్టియర్, సెకండియర్-2024 ఫలితాలను రికార్డు స్థాయిలో ఒకే ఒక్క క్లిక్‌తో అందరి కంటే ముందుగానే సాక్షిఎడ్యుకేషన్.కామ్ (www.sakshieducation.com) వెబ్‌సైట్‌లో అందుబాటలోకి తీసుకోచ్చింది. ఇలాగే తెలంగాణ ఇంటర్ మొదటి, రెండో సంవత్సరం పబ్లిక్ పరీక్షలు 2024 ఫలితాలను www.sakshieducation.comలో చూడొచ్చు.