గణితశాస్త్ర బోధన ఉద్దేశాలు, విలువలు, లక్ష్యాలు, మూల్యాంకనం :
- గణిత అభ్యసన వల్ల విద్యార్థుల్లో తార్కిక ఆలోచన, విశ్లేషణ, వివేచన, క్రమశిక్షణ మొదలైనవి అలవడతాయి.
- గణిత అధ్యయనం వల్ల ఒక వ్యక్తి తాను ఎంచుకున్న రంగంలో ప్రసిద్ధుడవుతాడు.
- శీలం అంటే ఒక వ్యక్తి ఇతరులతో కలిసినప్పుడు తన ప్రవర్తనావళి.
- గణిత పఠనం వల్ల విద్యార్థికి మంచి లక్షణాలు, క్రమశిక్షణ, నిర్మాణకత, క్రమ సరళి, పద్ధతి మొదలైనవి అలవడతాయి.
- సంస్కృతిని మనం ముందు తరాల నుంచి అందుకొని తగిన విధంగా మార్పులు, చేర్పులు చేస్తూ ఎక్కువగా విద్యా మాధ్యమం ద్వారా భావితరాల వారికి అందిస్తాం.
- గణితం సంస్కృతికి అద్దం వంటిది - బేకన్
- విద్యార్థులను ఏ రంగానికైనా, ఏ కళకైనా, ఏ వృత్తికైనా గణిత అభ్యసనం ద్వారా సన్న ద్ధులను చేసి ఎలాంటి సమస్యలనైనా పరి ష్కరించుకోవడానికి వీలు కల్పిస్తుంది.
- విద్యార్థి గణిత ఉద్దేశాలను తెలుసుకున్నప్పుడు, గణితంపై ఇష్టం పెంచుకొని స్వయం అధ్యయనం చేస్తాడు.
- జ్ఞానాన్ని చిన్న చిన్న ముక్కలుగా కాకుండా సమగ్రమైన మొత్తంగా అందించడం వల్ల విద్యార్థికి అవగాహన సులభమవుతుంది.
- ఏదైనా ఒక విషయంలోని సమస్యను మరొక విషయం సహాయంతో పరిష్కరించడమే సహసంబంధం - బ్రాడ్ఫోర్డ్
- విద్యార్థికి ఒక అంశంలోని సామర్థ్యం మరో అంశంలోని సామర్థ్యాన్ని పెంచుతుంది- థారన్డైక్
1) అంతర్గత సహ సంబంధం
2) బాహ్య సహ సంబంధం
అంతర్గత సహ సంబంధం: గణితంలో వివిధ శాఖల మధ్య ఉండే సహసంబంధం
ఉదా: (x+y)2=x2+2xy+y2 కు జ్యామితీయ నిరూపణ, బీజగణిత, రేఖాగణితాల మధ్య సహసంబంధం తె లియజేయడం
బాహ్య సహ సంబంధం: ఇది గణితం, ఇతర సబ్జెక్టులకు మధ్య సహ సంబంధం తెలుపుతుంది.
ఉదా:1) కర్బనాన్ని క్రమషడ్భుజి ద్వారా చూపడం, రసాయన శాస్త్రం - గణితం
2) మానవుడిలోని ఎముకల సంఖ్య - 206, జీవశాస్త్రం - గణితం.
మాదిరి ప్రశ్నలు
1. ఒక వ్యక్తి దేన్ని మొదట, మధ్యలో, తుదిగా చేయాలో నిర్ణయించడానికి అవకాశం కల్పించేది?
ఎ) సృజనాత్మకత
బి) క్రమశిక్షణ
సి) సంస్కృతి
డి) జ్ఞానం
- View Answer
- సమాధానం: బి
2.‘వ్యక్తులు వారి వారి స్థాయి, నైపుణ్యాన్ని బట్టి గణితాన్ని వృత్తిగా ఎన్నుకుంటారు’ ఏ ఉద్దేశాన్ని సూచిస్తుంది?
ఎ) సన్నాహ
బి) క్రమశిక్షణ
సి) ఉదరపోషణ
డి) ప్రయోజన
- View Answer
- సమాధానం: సి
3. ‘గణిత అభ్యసనం వల్ల క్రమశిక్షణ, నిర్మాణాత్మకత, క్రమసరళి మొదలైన సులక్షణాలు అలవడతాయి’ అని తెలిపే ఉద్దేశం?
ఎ) శీలోద్దేశం
బి) జ్ఞానోద్దేశం
సి) సన్నాహోద్దేశం
డి) ప్రయోజనోద్దేశం
- View Answer
- సమాధానం: ఎ
4.రాణి ‘తాను పొందిన గణిత భావనలు తన పెరటి వైశాల్యం కనుక్కోవడానికి వినియో గిస్తే అది ఏ విలువను తెలుపుతుంది?
ఎ) సన్నాహ
బి) క్రమశిక్షణ
సి) ఉదర పోషణ
డి) ప్రయోజన
- View Answer
- సమాధానం: డి
5. విద్యార్థులు గణితాన్ని తీరిక సమయాల్లో మనోరంజకంగా ఉపయోగించేలా చూడడం ఏ స్థాయి ఉద్దేశం?
ఎ) పూర్వ ప్రాథమిక
బి) ప్రాథమిక
సి) ప్రాథమికోన్నత
డి) ఉన్నత
- View Answer
- సమాధానం: బి
6. సమయపాలన, ధైర్యం, ఆత్మవిశ్వాసం అలవాటు చేసే విలువ?
ఎ) సన్నాహ
బి) మేధా సంబంధిత
సి) క్రమశిక్షణ
డి) సాంస్కృతిక
- View Answer
- సమాధానం: సి
7. ‘విద్యార్థికి ఒక అంశంలోని సామర్థ్యం మరొక అంశంలోని సామర్థ్యాన్ని పెంచుతుంది’’ అని తెలిపినవారు?
ఎ) థారన్డైక్
బి) పైథాగరస్
సి) బ్రాడ్ఫోర్డ
డి) బెర్త్లాట్
- View Answer
- సమాధానం: ఎ
8. ‘‘ఎక్కడ లయ ఉందో అక్కడ సంఖ్య ఉంటుంది’ అని తెలిపే గణిత బోధన విలువ?
ఎ) మేధో సంబంధిత
బి) సౌందర్యాత్మక
సి) మానసిక
డి) సామాజిక
- View Answer
- సమాధానం: బి
9. గణిత బోధనా ఉద్దేశాలు ఉపాధ్యాయుడు ఎప్పుడు నిర్ణయించుకోవాలి?
ఎ) బోధనాభ్యసనకు ముందు
బి) బోధనాభ్యసన జరుగుతున్నప్పుడు
సి) బోధనాభ్యసన తర్వాత
డి) మూల్యాంకనం చేస్తున్నప్పుడు
- View Answer
- సమాధానం: ఎ
10.వీటిలో ఉన్నతస్థాయి గణిత బోధనా ఉద్దేశం?
ఎ) గణితాన్ని మనోరంజకంగా ఉపయోగించుకోవడం
బి) గణిత గుర్తులు, చిహ్నాలు పరిచయం చేయడం
సి) విద్యార్థుల్లో ఆలోచనా శక్తి పెంపొందించడం
డి) గణిత శాస్త్ర నైపుణ్యాలు, గుర్తులను నిత్య జీవితంలో ఉపయోగించుకోవడం
- View Answer
- సమాధానం: డి
11. (a+b)2=a2+2ab+b2ను రేఖాచిత్రం ఆధారంగా బోధించడం ఏ సహసంబంధాన్ని తెలుపుతుంది?
ఎ) అంతర్గత
బి) బాహ్య
సి) అంతర్గత-బాహ్య
డి) బాహ్య-బాహ్య
- View Answer
- సమాధానం: ఎ
12. గణిత పజిల్స్ ద్వారా విద్యార్థుల్లో పెంపొందించే విలువ?
ఎ) సౌందర్యాత్మక
బి) సృజనాత్మక
సి) మానసిక
డి) మేధో సంబంధిత
- View Answer
- సమాధానం: బి
13. గణిత పజిల్స్ ద్వారా విద్యార్థుల్లో పెంపొందించే విలువ?
ఎ) సౌందర్యాత్మక
బి) సృజనాత్మక
సి) మానసిక
డి) మేధో సంబంధిత
- View Answer
- సమాధానం: సి
14. విద్యార్జన ప్రాథమిక ఉద్దేశం?
ఎ) ఉదర పోషణార్థం
బి) ప్రయోజనం
సి) జ్ఞానం
డి) శీల నిర్మాణం
- View Answer
- సమాధానం: ఎ
15. వ్యాపారం, పరిశ్రమలు గణితంపై ఆధారపడడం ఏ విలువను సూచిస్తాయి?
ఎ) ప్రయోజన
బి) క్రమశిక్షణ
సి) సాంస్కృతిక
డి) సామాజిక
- View Answer
- సమాధానం: సి
16. గణితం ఉద్దేశాలకు సంబంధించి వీటిలో సరైంది?
ఎ) ఉద్దేశం విశాల అర్థం ఉన్న పదం
బి) ఉద్దేశాలు గణిత విద్యా దిశను సూచిస్తాయి
సి) కోరికను ప్రకటించేవి ఉద్దేశాలు
డి) పైవన్నీ
- View Answer
- సమాధానం: డి
17. గణిత బోధన ఎందుకు చేయాలో తెలుసుకోవడానికి తోడ్పడేవి?
ఎ) విలువలు
బి) ఉద్దేశాలు
సి) లక్ష్యాలు
డి) స్పష్టీకరణలు
- View Answer
- సమాధానం: బి
18. ‘ఏదైనా ఒక విషయంలోని సమస్యను మరొక విషయం సహాయంతో పరిష్కరించడమే సహ సంబంధం’ అని నిర్వచించినవారు?
ఎ) డట్టన్
బి) బేకన్
సి) బ్రాడ్ఫోర్డ
డి) థారన్డైక్
- View Answer
- సమాధానం: సి
19. విద్యార్థులను ఉత్పాదక జీవితం గడపడానికి సిద్ధం చేయడం ఏ స్థాయి బోధనోద్దేశం?
ఎ) ప్రాథమిక
బి) ప్రాథమికోన్నత
సి) పూర్వ ప్రాథమిక
డి) ఉన్నత
- View Answer
- సమాధానం: డి
ఎ) క్రమశిక్షణ
సి) ప్రయోజన
- View Answer
- సమాధానం: బి
21. ఇచ్చిన భిన్నాలను క్రమ, అపక్రమ భిన్నాలుగా విద్యార్థి వర్గీకరించడం ఏ లక్ష్యాన్ని తెలుపుతుంది?
ఎ) జ్ఞానం
బి) అవగాహన
సి) వినియోగం
డి) నైపుణ్యం
- View Answer
- సమాధానం: బి
22. ఇచ్చిన పటాల్లో వృత్తాన్ని గుర్తిస్తే విద్యార్థి సాధించిన లక్ష్యం?
ఎ) జ్ఞానం
బి) అవగాహన
సి) నైపుణ్యం
డి) ప్రశంస
- View Answer
- సమాధానం: ఎ
23. శిల్ప నిర్మాణాలు పరిశీలించి, వాటి నిర్మాణ సూత్రాలన్నీ గణితాధారాలే అని తెలపడం ఏ విలువను తెలియజేస్తుంది?
ఎ) ప్రయోజన
బి) సాంస్కృతిక
సి) క్రమశిక్షణ
డి) సమాచార
- View Answer
- సమాధానం: బి
24. రాణి త్రిభుజ వైశాల్యం కనుక్కోవడానికి అ = బీఛజి ను సూచిస్తే ఆమె సాధించిన లక్ష్యం?
ఎ) నైపుణ్యం
బి) వినియోగం
సి) అవగాహన
డి) జ్ఞానం
- View Answer
- సమాధానం: సి
25. ప్రకృతి శక్తులకు సంబంధించిన అవగాహనకు గణితం ఉపయోగపడుతుంది. ఇది ఏ విలువను సూచిస్తుంది?
ఎ) ప్రయోజన
బి) క్రమశిక్షణ
సి) సాంస్కృతిక
డి) కళాత్మక
- View Answer
- సమాధానం: ఎ
26. సకల శాస్త్రాలకూ గణితం మూలం, ద్వారం లాంటిదని అన్నవారు?
ఎ) నెపోలియన్
బి) లైబ్నిజ్
సి) బేకన్
డి) లాక్
- View Answer
- సమాధానం: సి
27.సన్నిహిత సంబంధాలున్న భావనలను విచక్షణ చేస్తాడనే స్పష్టీకరణ ఏ లక్ష్యానికి చెందుతుంది?
ఎ) జ్ఞానం
బి) అవగాహన
సి) వినియోగం
డి) నైపుణ్యం
- View Answer
- సమాధానం: బి
28. సంఖ్యారేఖపై భిన్నాలను సూచించిన విద్యార్థి సాధించిన లక్ష్యం?
ఎ) జ్ఞానం
బి) అవగాహన
సి) వినియోగం
డి) నైపుణ్యం
- View Answer
- సమాధానం: డి
29. గణిత అధ్యయనం ద్వారా సృజనాత్మకత పెంపొందడం ఏ విలువను సూచిస్తుంది?
ఎ) ప్రయోజన
బి) క్రమశిక్షణ
సి) సాంస్కృతిక
డి) సన్నాహ
- View Answer
- సమాధానం: బి
30. కారణాలు తెలుపుతాడు అనేది ఏ లక్ష్యానికి చెందుతుంది?
ఎ) నైపుణ్యం
బి) వినియోగం
సి) జ్ఞానం
డి) అవగాహన
- View Answer
- సమాధానం: డి
31. జ్ఞానం, నైపుణ్యాలు ఏ విద్యా విలువకు చెందుతాయి?
ఎ) ప్రయోజన
బి) క్రమశిక్షణ
సి) సాంస్కృతిక
డి) కళాత్మక
- View Answer
- సమాధానం: ఎ
32. మంచి నడవడి ఆశయాలు ఏ విలువను సూచిస్తాయి?
ఎ) ప్రయోజన
బి) క్రమశిక్షణ
సి) సాంస్కృతిక
డి) కళాత్మక
- View Answer
- సమాధానం: సి
33. I = PTR/100 నుంచి P =100×I/TR అని తెలిపిన విద్యార్థి సాధించిన లక్ష్యం?
ఎ) వినియోగం
బి) ఆగమనం
సి) అవగాహన
డి) నైపుణ్యం
- View Answer
- సమాధానం: సి
34. ఇచ్చిన భిన్నానికి సమాన భిన్నాలను తప్పులు లేకుండా విద్యార్థి వేగంగా తెలిపాడు. ఇది ఏ లక్ష్యాన్ని సూచిస్తుంది?
ఎ) జ్ఞానం
బి) అవగాహన
సి) వినియోగం
డి) నైపుణ్యం
- View Answer
- సమాధానం: డి
35. గణితంలో ఆటలు, పాటలు ఏ విలువను తెలుపుతాయి?
ఎ) సన్నాహ
బి) సమాచార
సి) కళాత్మక
డి) సాంస్కృతిక
- View Answer
- సమాధానం: సి
36. ఒక దీర్ఘ చతురస్ర వైశాల్యం దాని పొడవు, వెడల్పుల లబ్ధానికి సమానం అనేదానికి అ=ఛ అని విద్యార్థి తెలిపితే, ఆ విద్యార్థి సాధించిన లక్ష్యం?
ఎ) జ్ఞానం
బి) అవగాహన
సి) విశ్లేషణ
డి) వినియోగం
- View Answer
- సమాధానం: బి
37. బ్లాక్ హార్స్ట్ వర్గీకరణలో చేరని విద్యావిలువ?
ఎ) దృక్పథాలు
బి) భావనలు
సి) సామర్థ్యాలు
డి) సమాచారం
- View Answer
- సమాధానం: సి
38. అభినందనలు ఒక విద్యా విలువగా వర్గీకరించినవారు?
ఎ) బ్లాక్ హార్స్ట్
బి) యంగ్
సి) మున్నిక్
డి) బ్రెస్లిచ్
- View Answer
- సమాధానం: డి
39. విద్యార్థి ప్రధాన సంఖ్యలకు 7, 11, 19... లను ఉదాహరణగా తెలిపితే ఆ విద్యార్థి సాధించిన లక్ష్యం?
ఎ) జ్ఞానం
బి) అభిరుచి
సి) వినియోగం
డి) అవగాహన
- View Answer
- సమాధానం: డి
40. లక్ష్యాలు రూపొందించడంలో నియమాలు తెలిపినవారు?
ఎ) బ్లూమ్
బి) మేసియా
సి) ఫ్రాస్ట్
డి) లాంగ్
- View Answer
- సమాధానం: సి
41.ఎలిమెంటరీ స్థాయి గణిత బోధనోద్దేశం కానిది?
ఎ) గణితంపట్ల ఆసక్తి కలిగించడం
బి) ఉత్పాదక, నిర్మాణాత్మక జీవితాన్ని గడపడం
సి) గణిత భాష గుర్తుల పరిచయం
డి) క్రమత, శుభ్రత, కచ్చితత్వం సాధించడం
- View Answer
- సమాధానం: బి
42. మార్కెట్లో వివిధ వస్తువుల ధరలను కనుక్కొని ధరల పట్టీ తయారు చేయడం ఏ నియోజనంలో భాగం?
ఎ) పాఠానికి ముందు సిద్ధం చేయాల్సిన
బి) సాధన చేయాల్సిన
సి) వ్యాసక్తుల
డి) పరీక్ష
- View Answer
- సమాధానం: సి
43. అభ్యసన అనుభవాలతో పరస్పర చర్యపొందిన తరువాత విద్యార్థుల్లో గమనించిన మార్పు?
ఎ) లక్ష్యం
బి) స్పష్టీకరణ
సి) అభ్యసన ఫలితం
డి) ఉద్దేశం
- View Answer
- సమాధానం: సి
44. మానసిక చలనాత్మక రంగంలో కృషిచేసినవారు?
ఎ) క్రాత్హోల్
బి) ఆర్.హెచ్. దవే
సి) మేసియా
డి) బ్లూమ్
- View Answer
- సమాధానం: బి
45. A = ph ను విద్యార్థి గది నాలుగు గోడల వైశాల్యం దాని భూ చుట్టుకొలత, ఎత్తుల లబ్దానికి సమానమని తెలిపితే ఆ విద్యార్థి సాధించిన లక్ష్యం?
ఎ) అవగాహన
బి) వినియోగం
సి) అభిరుచి
డి) నైపుణ్యం
- View Answer
- సమాధానం: ఎ
46. భావావేశ రంగంలో ఉన్నత లక్ష్యం?
ఎ) లాక్షణీకరణం
బి) వ్యవస్థాపన
సి) విలువకట్టడం
డి) గ్రహించడం
- View Answer
- సమాధానం: ఎ
47. నూతన దత్తాంశాలను ప్రతిపాదించడం ఏ లక్ష్యానికి చెందిన స్పష్టీకరణ?
ఎ) జ్ఞానం
బి) అవగాహన
సి) వినియోగం
డి) నైపుణ్యం
- View Answer
- సమాధానం: సి
48. సవరించిన బ్లూమ్ వర్గీకరణలో ఉన్నత లక్ష్యం?
ఎ) మూల్యాంకనం
బి) ఉత్పత్తి
సి) విశ్లేషణ
డి) వినియోగించడం
- View Answer
- సమాధానం: బి
49. విద్యార్థి ప్రధానసంఖ్య నిర్వచనాన్ని తెలిపాడు. ఆ విద్యార్థి సాధించిన లక్ష్యం?
ఎ) జ్ఞానం
బి) అవగాహన
సి) వినియోగం
డి) నైపుణ్యం
- View Answer
- సమాధానం: ఎ
50.స్పష్టీకరణల లక్షణం?
ఎ) లక్ష్యాల పరిధిని తెలుపుతాయి
బి) లక్ష్యానికి మరొక లక్ష్యానికి తేడా తెలుపుతాయి
సి) పరీక్షాంశాల ఎన్నికకు ఉపయోగం
డి) పైవన్నీ
- View Answer
- సమాధానం: డి
51. మూల్యాంక ప్రక్రియలో నాలుగు ప్రధాన ఉపక్రియలకు చెందనిది?
ఎ) తీర్పు తయారు చేయడం
బి) సమాచారం వివరించడం
సి) బోధించడం
డి) నిర్ణయం తీసుకోవడం
- View Answer
- సమాధానం: సి
52. ‘త్రిభుజాలు నిర్మించడం’ ఏ నియోజనానికి ఉదాహరణ?
ఎ) పాఠానికి ముందు సిద్ధం చేయాల్సిన భాగం
బి) సాధన చేయాల్సిన భాగం
సి) వ్యాసక్తుల భాగం
డి) ఏదీకాదు
- View Answer
- సమాధానం: బి
53. కింది పటాన్ని పరిశీలించి ఉన్నతస్థాయి విద్యార్థులు ఎక్కువగా ఉన్నారని తెలిపితే ఆ విద్యార్థులు సాధించిన లక్ష్యం?
ఎ) జ్ఞానం
బి) అవగాహన
సి) వినియోగం
డి) నైపుణ్యం
- View Answer
- సమాధానం: బి