భాష (బోధన పద్ధతులు)

టెట్ కమ్ టీఆర్‌టీ-2014కు సన్నద్ధమవుతున్న అభ్యర్థులు తెలుగు మెథడాలజీపై ప్రత్యేక దృష్టిని సారించాలి. ఎస్‌జీటీ, లాంగ్వేజ్ పండిట్స్ అభ్యర్థులు డీఎడ్ - తెలుగు అకాడమీ పాఠ్యపుస్తకాన్ని చదవాలి. గణితం, ఫిజికల్ సైన్‌‌స, బయాలజీ, సోషల్ స్టడీస్, ఇంగ్లిష్, తెలుగు స్కూల్ అసిస్టెంట్ పోస్టులకు సిద్ధమయ్యేవారు బీఎడ్ - తెలుగు అకాడమీ పాఠ్యపుస్తకాలను చదవాలి. గత టెట్, డీఎస్సీ పరీక్షల్లో తెలుగు అకాడమీ పాఠ్యపుస్తకాల నుంచే ఎక్కువ ప్రశ్నలు వచ్చాయి. ఇప్పుడు డీఎడ్- తెలుగు అకాడమీ పాఠ్యపుస్తకంలో మొదటి అధ్యాయం ‘భాష’ గురించి సమగ్రంగా తెలుసుకుందాం.

మాదిరి ప్రశ్నలు
  1. భాష అనే పదం ఏ ధాతువు నుంచి వచ్చింది?
    1. భాస్
    2. భాష్
    3. భాశ్
    4. భాష్యతి
  2. భాష్యత ఇతిభాషా అంటే అర్థమేమిటి?
    1. భావ వినిమయ సాధనం భాష
    2. భావ గ్రహణ సాధనం భాష
    3. భాషించేది భాష
    4. భావ ప్రకటన చేసేది భాష
  3. మానవులు తమ అభిప్రాయాలను ఎదుటి వారికి తెలుపుతూ పరస్పరం సహకరించుకోవడానికి తోడ్పడే మౌఖిక ధ్వనుల స్వతంత్ర వ్యవస్థ భాష’ అని ఎవరన్నారు?
    1. హాకెట్
    2. సైమన్ పాటర్
    3. ఎన్.కృష్ణస్వామి
    4. రామచంద్రవర్మ
  4. ‘పలు భాషణ అలవాట్లతో కూడిన సంక్లిష్ట వ్యవస్థ భాష’ అని ఎవరన్నారు?
    1. హాకెట్
    2. రామచంద్రవర్మ
    3. ఎస్.కె.వర్మ
    4. రామచంద్ర శుక్లా
  5. మనసులోని భావ పరంపరను ఏ పదాలు, ఏ వాక్యాలు ఎదుటివారికి అందిస్తాయో, ఆ పదాలు, ఆ వాక్యాలే భాష అని నిర్వచించింది?
    1. హాకెట్
    2. సైమన్ పాటర్
    3. రామచంద్ర శుక్లా
    4. రామచంద్ర వర్మ
  6. బుద్ధిజీవుల అనుభవాల అభివ్యక్తే భాష అని ఎవరన్నారు?
    1. ఐజ్లర్
    2. రామచంద్రవర్మ
    3. హాకెట్
    4. సైమన్ పాటర్
  7. క్రియా పదాల నుంచి భాష పుట్టిందన్న ధాతువాదాన్ని సమర్థించిన భారతీయ భాషావేత్త?
    1. కాత్యాయనుడు
    2. యాస్కాచార్యుడు
    3. ఋష్యశృంగుడు
    4. మాక్స్‌ముల్లర్
  8. ప్రకంపన వాదమని ఏ వాదాన్ని అంటారు?
    1. పూ-పూ వాదం
    2. యోహిహో వాదం
    3. డింగ్-డాంగ్ వాదం
    4. భౌవౌ వాదం
  9. డింగ్-డాంగ్ వాదాన్ని ఎవరు ప్రతి పాదించారు?
    1. యాస్కాచార్యుడు
    2. మాక్స్‌ముల్లర్
    3. చామ్‌స్కీ
    4. కాత్యాయనుడు
  10. ఆనందం, దుఃఖం, ఆశ్చర్యం వంటి ఉద్వే గాల ప్రకటనాభిలాషే భాషకు మూలమని చెప్పిన వాదం?
    1. ప్రకంపన వాదం
    2. యొహిహో వాదం
    3. పూ-పూ వాదం
    4. వివక్షా ప్రేరణ వాదం
  11. చామ్‌స్కీ అనే హేతువాది ప్రతిపాదించిన వాదం?
    1. సంపాదన వాదం
    2. స్వతస్సిద్ధ వాదం
    3. సాంకేతిక వాదం
    4. ధాతు వాదం
  12. తత్వశాస్త్రంలోని అనుభవవాదం ఆధా రంగా ప్రతిపాదించిన వాదం?
    1. సంపాదన వాదం
    2. సాంకేతిక వాదం
    3. స్వతస్సిద్ధ వాదం
    4. ధాతు వాదం
  13. సంపాదన వాదాన్ని ఇలా కూడా వ్యవ హరిస్తారు?
    1. ప్రకృతి వాదం
    2. సాంకేతిక వాదం
    3. అనుభవ వాదం
    4. క్రమ పరిణామ వికాస వాదం
  14. ‘మనిషి పుట్టుకతో భాష రాదు. శిశువు పెరిగే కొద్దీ పరిసరాలతో తాను పొందే అనుభవాల నుంచి భాషాభివృద్ధి జరుగు తుంది’ అని చెప్పిన వాదం?
    1. సాంకేతిక వాదం
    2. సంపాదన వాదం
    3. స్వతస్సిద్ధ వాదం
    4. డింగ్-డాంగ్ వాదం
  15. ఏ గూటి చిలుక ఆ గూటి పలుకులు పలుకుతుందనే నానుడి ఏ భాషావాదాన్ని సమర్థిస్తుంది?
    1. స్వతస్సిద్ధవాదం
    2. క్రమ పరిణామ వికాస వాదం
    3. సాంకేతిక వాదం
    4. సంపాదన వాదం
  16. ఏ శాస్త్రంలోని ప్రవృత్తివాదం సంపాదన వాదాన్ని బలపరుస్తుంది?
    1. తత్వశాస్త్రం
    2. మనస్తత్వశాస్త్రం
    3. భాషాశాస్త్రం
    4. జంతుశాస్త్రం
  17. ఎవరు తన ప్రయోగాల ద్వారా సంపాదన వాదాన్ని నిరూపించారు?
    1. పావ్‌లోవ్
    2. మాక్స్‌ముల్లర్
    3. బి.ఎఫ్.స్కిన్నర్
    4. థార్‌‌నడైక్
  18. భాష ఒక తరం నుంచి తర్వాతి తరాలకు ప్రసరిస్తుంది. అంటే సంస్కృతి వలే భాష కూడా తర్వాత తరతరాలకు సంక్రమిస్తుం ది’. ఇది భాష ఏ లక్షణం?
    1. ప్రత్యేకత
    2. ప్రేరణ దూరత
    3. ద్వివిధ నిర్మాణం
    4. సాంస్కృతిక ప్రసరణం
  19. లిపి అనే పదం ఏ భాషలోని డిపి నుంచి పుట్టింది?
    1. లాటిన్
    2. గ్రీకు
    3. పార్శీ
    4. సంస్కృతం
  20. ఎక్కడ లభించిన అశోకుని శిలాశాసనం ఆధారంగా 1వ శతాబ్దం నాటికే ఆంధ్ర దేశంలో లిపి ఉన్నట్లు తెలుస్తుంది?
    1. అద్దంకి
    2. అమరావతి
    3. ఎర్రగుడిపాడు
    4. పొట్లదుర్తి
  21. తెలుగు లిపి ఏ లిపికి సన్నిహితంగా ఉన్నట్లు అశోకుని శిలాశాసనం వల్ల తెలుస్తుంది?
    1. పంగలకర్ర లిపి
    2. కన్నడ లిపి
    3. బ్రాహ్మీ లిపి
    4. దేవనాగరి లిపి
  22. తెలుగు లిపి ఏ లిపి నుంచి ఉద్భవించిందని అంటున్నారు?
    1. కన్నడ లిపి
    2. మౌర్య లిపి
    3. దేవనాగరి లిపి
    4. దక్షిణ బ్రాహ్మీ లిపి
  23. ఎవరి కాలంలో ద్రావిడ భాషకు సంబంధించిన ‘ఱ’ అనే అక్షరం శాసనాల్లో కనిపి స్తుంది?
    1. శాతవాహనులు
    2. శాలంకాయనులు
    3. చాళుక్యులు
    4. విష్ణుకుండినులు
  24. లిపి పరిణామ క్రమాన్ని తెలుగు భాషా చరిత్ర అనే గ్రంథంలో చక్కగా వివరించినవారు?
    1. జి.యన్. రెడ్డి
    2. భద్రిరాజు కృష్ణమూర్తి
    3. పి.ఎస్. సుబ్రహ్మణ్యం
    4. తూమాటి దోణప్ప
  25. చాళుక్య వంశానికి చెందిన ఎరికల్ ముత్తురాజు వేయించిన తొలి తెలుగు శాసనం ఎక్కడ లభిస్తుంది?
    1. కలమందలపాడు
    2. అద్దంకి
    3. ఎర్రగుడిపాడు
    4. పొట్లదుర్తి- మాలెపాడు
  26. నన్నయ ఏ లిపిలో భారతం రాశాడు?
    1. దేవనాగరి లిపి
    2. వేంగి చాళుక్య లిపి
    3. బ్రాహ్మీ లిపి
    4. మూలద్రావిడ లిపి
  27. ఏ కవి కాలం నాటి లిపికి, నేటి తెలుగు లిపికి సన్నిహిత సంబంధం ఉంది?
    1. నన్నయ
    2. తిక్కన
    3. పాల్కురికి సోమనాథుడు
    4. శ్రీనాథుడు
  28. తెలుగు వర్ణమాలలోని చ, జ అక్షరాల్లో దంత్యోచ్ఛారణ కోసం ‘ ’్త గుర్తును ఎవరు చేర్పించినట్లు గుర్తించారు?
    1. సి.పి. బ్రౌన్
    2. చిన్నయసూరి
    3. బిషప్ కాల్ద్వెల్
    4. వేటూరి ప్రభాకరశాస్త్రి
  29. తెలుగు భాషకు చిన్నయసూరి రాసిన అత్యంత ప్రామాణిక వ్యాకరణ గ్రంథం?
    1. ప్రౌఢ వ్యాకరణం
    2. సూత్రాంధ్ర వ్యాకరణం
    3. ఆంధ్రశబ్ద లక్షణ సంగ్రహం
    4. బాల వ్యాకరణం
  30. ‘తెలుగునకు వర్ణములు ముప్పదియారు’ అని ఎవరు ఏ గ్రంథంలో చెప్పారు?
    1. ప్రౌఢ వ్యాకరణం- బహుజనపల్లి సీతారామాచార్యులు
    2. బాల వ్యాకరణం- చిన్నయసూరి
    3. ఆంధ్రశబ్ద చింతామణి- నన్నయ
    4. శబ్దరత్నాకరం- బహుజనపల్లి సీతారా మాచార్యులు
  31. మనకు గాలి, నీరు, ఆహారం ఎంత ముఖ్యమో ఇది కూడా అంతే ముఖ్యం?
    1. ధ్వని
    2. వాక్యం
    3. భావ ప్రకటన
    4. భాష
  32. తనకు తానే మాట్లాడుకోవడం లేదా తనకే పరిమితమైన లేఖనాన్ని ఏమంటారు?
    1. గ్రహణం
    2. అభివ్యక్తి
    3. ఆత్మగతం
    4. ప్రకాశం
  33. భాషోపాధ్యాయుడు తరగతి గదిని ఎలా భావించి, కృత్రిమ సన్నివేశాలు, ఘట్టాలు, సృష్టించి విద్యార్థులకు అనుభవపూర్వకమైన భాషా వినియోగం కలిగించాలి?
    1. ఒక ప్రయోగశాలగా
    2. సౌరకుటుంబంలా
    3. ఒక సూక్ష్మ సమాజంగా
    4. వసుధైక కుటుంబంగా
  34. భాషాధ్వనులకు పుట్టుక, పలకడంలో ముఖయంత్ర వినియోగం, ధ్వనితరంగాల లక్షణం వివరించేది?
    1. వ్యాకరణ శాస్త్రం
    2. భాషాశాస్త్రం
    3. మనోవిజ్ఞాన శాస్త్రం
    4. ధ్వని విజ్ఞానం
  35. వాగుత్పత్తిలో కంఠం, తాలువు, మూర్థం, దంత మూలం, పై పెదవి వీటిని ఏమంటారు?
    1. కంఠధ్వనులు
    2. స్థానాలు
    3. కరణాలు
    4. ప్రయత్నాలు
  36. వాగుత్పత్తిలో జిహ్వ, ఓష్ఠం, గళగర్తం లను ఏమంటారు?
    1. కరణాలు
    2. స్థానాలు
    3. ప్రయత్నాలు
    4. ధ్వని వర్ణాలు
  37. నన్నయ నుంచి పరవస్తు చిన్నయసూరి వరకు వెల్లివిరిసిన సాహిత్యమంతా ఏ భాష లో నిక్షిప్తమైంది?
    1. ప్రామాణిక భాష
    2. సరళగ్రాంథిక భాష
    3. గ్రాంథిక భాష
    4. మాండలిక భాష
  38. ప్రామాణిక భాషనే ఇలా వ్యవహరిస్తారు?
    1. మాండలికం
    2. గ్రాంథికం
    3. వ్యవహారికం
    4. శిష్ట వ్యవహారికం
  39. వ్యవహారిక భాష కోసం ఉద్యమం చేప ట్టినవారు?
    1. వేదం వెంకటరాయశాస్త్రి
    2. గిడుగు సీతారామశాస్త్రి
    3. గిడుగు రామమూర్తి
    4. గురజాడ అప్పారావు
  40. ఉపభాష, ప్రాదేశిక భాష అని ఏ భాషను పిలుస్తారు?
    1. వ్యవహారికం
    2. గ్రాంథికం
    3. మాండలికం
    4. ప్రామాణికం
  41. ఏ మండలంలో సొమ్ములు అంటే ఆవులు అని అర్థం?
    1. పూర్వ మండలం
    2. మధ్య మండలం
    3. దక్షిణ మండలం
    4. ఉత్తర మండలం
  42. నాగలిని మడక అని ఏ ప్రాంతంలో పిలుస్తారు?
    1. గోదావరి
    2. కోస్తాంధ్ర
    3. తెలంగాణ
    4. రాయలసీమ
  43. మూలభాష నుంచి లక్ష్యభాషలోకి భాషాం తరీకరణం చేసే నేర్పును ఏమంటారు?
    1. అనుకరణశక్తి
    2. భాషాంతరీకరణ సామర్థ్యం
    3. లక్ష్యాధారిత సామర్థ్యం
    4. భాషా వినియోగం
  44. మూల భాషా రచనాశైలి లక్ష్యభాషలో కూడా ఉంటూ, మూలానికి కట్టుబడి చేసే అనువాదం’ ఏది?
    1. మూలానువాదం
    2. మూల విధేయానువాదం
    3. స్వేచ్ఛానువాదం
    4. పదానువాదం
  45. అనువాదకుడు లక్ష్యభాషకు తగిన, తనదైనశైలిని, స్వతంత్రతను ప్రదర్శిస్తే దానిని ఏమంటారు?
    1. స్వేచ్ఛానువాదం
    2. భావానువాదం
    3. పదానువాదం
    4. మూల విధేయానువాదం
  46. దినచర్య రహస్యలేఖలు దేనికి ఉదా హరణలు?
    1. ప్రకాశం
    2. అభివ్యక్తం
    3. గ్రహణం
    4. ఆత్మగతం

సమాధానాలు

 1) 2;

 2) 3;

3) 2;

4) 1;  

5) 4;

6) 1; 

7) 2;

8) 1;  

9) 2;

10) 4;

11) 2;

12) 1;

13) 3

14) 2;

15) 4;

16) 2;

 17) 3;

18) 4;

19) 3;

20) 2;

21) 3;

22) 4;

23) 4;

24) 2;

25) 3;

26) 2;

27) 4;

28) 1;

29) 4;

30) 3;

31) 4;

32) 3;

 33) 3;

34) 4;

35) 2;

36) 1;

37) 3;

38) 4;

39) 3;

40) 3;

 41) 1;

42) 4;

43) 2;

44) 2;

45) 1;

46) 4.

 

 



గత టెట్, డీఎస్సీ ప్రశ్నలు
  1. భాషకు మూలం?
    1. వాక్యం
    2. ధ్వని
    3. భావం
    4. ఆలోచన
  2. భాషకు మూలం కొన్ని ధాతువులే అని ప్రతిపాదించినవారు?
    1. నోమ్‌చామ్‌స్కీ
    2. బ్లూమ్‌ఫీల్డ్
    3. యాస్కాచార్యుడు
    4. కాత్యాయనుడు
  3. ఆంధ్రభాషా బోధన సరస్వం పుస్తక రచయిత?
    1. శ్రీరామచంద్రుని వేంకట శేషయ్య
    2. పావులూరి కామేశ్వరరావు
    3. గొడవర్తి సూర్యనారాయణ
    4. కె.వి.వి.యల్. నరసింహారావు
  4. మాక్స్‌ముల్లర్ ప్రతిపాదించిన భాషావాదం?
    1. ధ్వన్యనుకరణ సిద్ధాంతం
    2. ధాతు జన్యువాదం
    3. డింగ్ డాంగ్ వాదం
    4. భగవదత్తం
  5. ‘ఉండుద్ది, వచ్చుద్ది’ మొదలైన క్రియా పదాలు వాడుకలో ఉన్న జిల్లా?
    1. తూర్పుగోదావరి
    2. పశ్చిమగోదావరి
    3. కృష్ణా
    4. గుంటూరు
  6. బిందుపూర్వక ‘బ’ కారం ఏ భాషలో కన్పిస్తుంది?
    1. మాండలిక
    2. గ్రాంథిక
    3. ప్రామాణిక
    4. వ్యవహారిక
  7. ప, ఫ, బ, భ, మ అనే వర్ణాలు?
    1. దంత్యాలు
    2. దంత్యోష్ట్యాలు
    3. ఓష్ఠ్యాలు
    4. తాలవ్యాలు
  8. వ్యవహారంలో ఉణ్యాధి క్రియారూపం కనిపించే జిల్లా?
    1. శ్రీకాకుళం
    2. నెల్లూరు
    3. ఆదిలాబాద్
    4. తూర్పుగోదావరి

సమాధానాలు

 1) 2;

 2) 3;

3) 1;

4) 3;

5) 4;

 6) 2;

 7) 3; 

8) 2.

 

 

 

 



























































#Tags