మెడికల్ కౌన్సిల్‌ను గుప్పిట్లో పెట్టుకునేందుకా?
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర మెడికల్ కౌన్సిల్‌లో ఎన్నికల ద్వారా ఎన్నుకునే సభ్యుల సంఖ్యను 13 నుంచి ఐదుకు తగ్గించినప్పుడు.. నామినేటెడ్ సభ్యుల సంఖ్యను కూడా ఆరు నుంచి రెండుకు ఎందుకు తగ్గించలేదని హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది.
రాష్ట్ర విభజన తర్వాత డాక్టర్ల సంఖ్య తగ్గిందని ఎన్నుకునే సభ్యుల సంఖ్యను ఐదుకు కుదించారని, కౌన్సిల్‌ను గుప్పిట్లో ఉంచుకోవాలనే ఉద్దేశంతోనే నామినేటెడ్ సభ్యుల సంఖ్యను తగ్గించలేదంటూ అసహనం వ్యక్తం చేసింది. ప్రభుత్వ నిర్ణయంలో హేతుబద్ధత లేదని, ఇలాగైతే నామినేటెడ్ సభ్యుల సంఖ్యను రెండుకు తగ్గించేలా తాము ఆదేశాలు ఇవ్వాల్సి వస్తుందని హెచ్చరించింది. తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకు కౌన్సిల్ ఎన్నికలు నిర్వహించరాదంటూ గతంలో ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను మరో 4 వారాలు పొడిగించింది. ఈ మేరకు చీఫ్ జస్టిస్ హిమాకోహ్లీ, జస్టిస్ బి.విజయసేన్‌రెడ్డితో కూడిన ధర్మాసనం శుక్రవారం ఉత్తర్వులు జారీచేసింది. ఎన్నుకునే సభ్యుల సంఖ్యను తగ్గిస్తూ ఇచ్చిన జీవోను సవాల్ చేస్తూ హెల్త్‌కేర్ రీఫామ్స్ డాక్టర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు డాక్టర్ కె.మహేశ్‌కుమార్‌తో పాటు మరికొందరు దాఖలు చేసిన పిటిషన్లను ధర్మాసనం మరోసారి విచారించింది.
2012 నుంచి ఎన్నికల్లేవ్..
ఉమ్మడి రాష్ట్రంలో 98 వేల మంది డాక్టర్లు ఉండేవారని, రాష్ట్ర విభజన తర్వాత వారి సంఖ్య 47 వేలకు తగ్గిందని అదనపు అడ్వొకేట్ జనరల్ జె.రామచందర్‌రావు నివేదించారు. అందుకే ఎన్నుకునే సభ్యుల సంఖ్యను ఐదుకు తగ్గించామని తెలిపారు. అయితే 2012 నుంచి ఎన్నికలు నిర్వహించకుండా నామినేటెడ్ సభ్యులతోనే కౌన్సిల్‌ను నిర్వహిస్తున్నారని పిటిషనర్ తరఫు న్యాయవాది సామ సందీప్‌రెడ్డి కోర్టు దృష్టికి తెచ్చారు. రాష్ట్ర కౌన్సిల్స్ ఎన్నుకున్న అభ్యర్థి మాత్రమే నేషనల్ అడ్వైజరీ కౌన్సిల్‌లో ఉండాలని, ఇక్కడ ఎన్నికలు నిర్వహించకపోవడంతో రాష్ట్రం నుంచి నామినేటెడ్ సభ్యుడే ఉంటున్నారని పేర్కొన్నారు. ఎన్నికైన సభ్యులు, నామినేటెడ్ సభ్యులు కలిసి చైర్మన్‌ను ఎన్నుకుంటారని.. నామినేటెడ్ సభ్యులే ఆరుగురు ఉండటంతో చైర్మన్‌గా ప్రభుత్వం కోరుకున్న వారే ఎన్నికవుతారని చెప్పారు. దీనిపై అఫిడవిట్ దాఖలు చేసేందుకు గడువు ఇవ్వాలని రామచందర్‌రావు కోరడంతో విచారణను ధర్మాసనం ఆగస్టు 5కి వాయిదా వేసింది.