కాళోజీ వర్సిటీలో నేటి పరీక్షలు వాయిదా: ఎందుకంటే..

సాక్షి, హైదరాబాద్: భారీ వర్షాల కారణంగా కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయం పరిధిలో నేడు (ఈ నెల 15న) జరగాల్సిన అన్ని పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు వర్సిటీ రిజిస్ట్రార్ డి.ప్రవీణ్‌కుమార్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు.
వాయిదా వేసిన థియరీ, ప్రాక్టికల్ పరీక్షల తేదీలను త్వరలో ప్రకటిస్తామన్నారు. మిగిలిన పరీక్షలు యథావిధిగా కొనసాగుతాయని స్పష్టం చేశారు. అలాగే బుధవారం జరగాల్సిన పరీక్షలు కూడా వాయిదా పడ్డాయి.