Top 10 Essential Strategies for JEE Mains 2025 : జేఈఈ మెయిన్స్ 2025: పరీక్షలో టాప్ 10 ర్యాంకు సాధించడానికి అవసరమైన వ్యూహాలు..
సాక్షి ఎడ్యుకేషన్: వచ్చే నెల 22వ తేదీ రాత్రి 11.50 గంటలల్లోగా ఫీజు చెల్లించేందుకు గడువుగా పేర్కొంది. జనవరి మొదటి వారంలో పరీక్ష కేంద్రాలను ప్రకటించనుంది. పరీక్ష తేదీకి మూడు రోజులు ముందుగా ఎన్టీఏ వెబ్‌సైట్‌లో అడ్మిట్ కార్డులు అందుబాటులో ఉంచుతామని ఎన్టీఏ తెలిపింది.
సిలబస్‌ను పూర్తి చేయాలి:
సిలబస్‌లో ఉన్న ప్రతీ చిన్న, పెద్ద అంశాన్ని క్షుణంగా పరిశీలించండి. ఎటువంటి టాపిక్‌ను వదలకుండా సిలబస్‌ను పూర్తి చేయండి.
కాన్సెప్టువల్ క్లారిటీపై అత్యంత దృష్టి:
కోర్ కాన్సెప్టులను లోతుగా అర్థం చేసుకొని, సిద్ధమవ్వాలి. దీంతో స్లిష్టమైన ప్రశ్నలకు కూడా సమాధానాలు లభిస్తాయి.
Nannaya University: ‘నన్నయ్య’ విద్యార్థినుల ఆకలి కేకలు
సమయపాలన:
సిలబస్, పరీక్ష సమయం, తేదీ వంటి విషయాలను దృష్టిలో పెట్టుకొని, చదవడానికి సమయం నిర్ణయించుకోవాలి. మీరు సిద్ధం చేసుకున్న ప్రణాళికకు కట్టుబడి ఉండండి.
ప్రాక్టీస్ తప్పనిసరి:
జేఈఈ పరీక్షలో ప్రాక్టీస్ ఘట్టం చాలా కీలకం. మీకు మీరే కొన్ని ప్రశ్నలను తయారు చేసుకొని, లేదా గతేడాది ప్రశ్నాపత్రాల సహాయంతో సిద్ధమవ్వడం, మాక్ టెస్ట్‌లు వంటివి చేస్తూ ఉండాలి.
☛Follow our YouTube Channel (Click Here)
వేగం పెంచాలి:
ప్రాక్టీస్ ప్రారంభించిన తరువాత, సమయానుసారం వేగం కూడా పెరగాలి. మొదట్లో 10 నిమిషాలు పట్టే ప్రశ్నకు మీ వేగంతో 5 నిమిషాలకు చేరాలి. వేగం పెరగాలేకాని తగ్గకూడదు.
సబ్జెక్టుకు అనుగుణంగా మార్గాలు:
ప్రతీ సబ్జెక్టుకు ప్రత్యేక అవసరాలు ఉంటాయి. వాటికి అనుగుణంగా మీరు కొత్త మార్గాలను అభివృద్ధి చేయాలి.
రివిజన్ ప్లానింగ్:
పరీక్ష దగ్గర పడుతున్న సమయంలో సిలబస్ మొత్తాన్ని రివిజన్ చేయడం తప్పనిసరి. ఇక్కడ, కీలకమైన అంశాలు, ఫార్ములాలు వంటివి మరోసారి అభ్యసించగలం.
మానసిక శారీరిక ఆరోగ్యం:
అభ్యసన మధ్యలో కాసేపు విరామం తప్పనిసరి. చదువులో పడి ఆహారం, నిద్ర, వ్యాయామం చేయడం మరవకండి. ఇవి, మీ మానసిక శారీరక ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.
మాక్ టెస్టులు:
చదివిన ప్రతీ సబ్జెక్ట్‌కు మీకు మీరే కొన్ని ప్రశ్నలను తయారు చేసుకొని టెస్ట్ ఇవ్వాలి. దీనిని మామూలు టెస్ట్‌లా కాకుండా మెయిన్ ఎగ్జామ్‌లా భావించి ప్లాన్ చేయండి. దీంతో మీ సమయపాలన, వేగం, దృష్టి వంటివాటిపై ఒక స్పష్టత వస్తుంది. దీంతో పరీక్ష సమయంలో జాగ్రత్తలు పాటించవచ్చు.
☛ Follow our Instagram Page (Click Here)
సబ్జెక్ట్ నిపుణులను సంప్రదించండి:
మీకు ఉన్న సందేహాలను సబ్జెక్ట్ నిపుణులను సందర్శించి తీర్చుకోండి. వారికి ఉన్న జ్ఞానం మీకు అభ్యసనకు, మాక్ టెస్టులకు ఎంతో సహాయపడుతుంది.
జనవరి 22 నుంచి 31వరకు ఉదయం 9 గంటల నుంచి 12 గంటలకు, మధ్యాహ్నం మూడు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు రెండు షిఫ్టుల్లో కంప్యూటర్‌పై పరీక్షను నిర్వహించనున్నట్టు వివరించింది. ఫిబ్రవరి 12న తుది ఫలితాలు వెల్లడించనుంది. జేఈఈ మెయిన్స్‌ను 13 ప్రాంతీయ భాషల్లో చేపట్టనుంది.
Letter Writing Competition: లేఖ రాయండి.. బహుమతి పొందండి!
సెక్షన్–బీలో చాయిస్ ఎత్తివేత
జేఈఈ మెయిన్స్–సెక్షన్–బీలో మూడేళ్లుగా కొనసాగుతున్న చాయిస్‌ను ఈసారి ఎత్తేశారు. జేఈఈ మెయిన్స్‌లో ఒక్కో ప్రశ్నకు 4 మార్కుల చొప్పున 75 ప్రశ్నలతో మొత్తం 300 మార్కులకు ప్రశ్నపత్రం ఇచ్చేవారు. గణితం, భౌతిక, రసా యన శాస్త్రాల నుంచి 25 చొప్పున ప్రశ్నలు ఉండేవి.
కోవిడ్ నేపథ్యంలో విద్యార్థులకు వెసులుబాటు ఇచ్చేందుకు ప్రతి సబ్జెక్టులో చాయిస్ ప్రశ్నలు ఇచ్చారు. జేఈఈ మెయిన్స్ 2021 నుంచి ఒక్కో సబ్జెక్టులో 30 చొప్పున మొత్తం 90 ప్రశ్నలు ఇస్తూ వచ్చారు. ప్రతి సబ్జెక్టులో ఏ, బీ సెక్షన్లు ఉండేవి.
☛ Join our WhatsApp Channel (Click Here)
సెక్షన్– ఏలో 20 ప్రశ్నలకు మొత్తం జవాబులు రాయాలి. సెక్షన్–బీలో 10 ఇచ్చి ఐదు ప్రశ్నలకు సమాధానాలు గుర్తించేలా చాయిస్ ఇస్తున్నారు. ఈసారి నుంచి ఆ చాయిస్ తీసేస్తున్నారు.
జేఈఈ మెయిన్స్–2025 షెడ్యూల్ ఇలా..
తొలి దశ మెయిన్స్...
28–10–2024 నుంచి 22–11–2024 ఆన్‌లైన్ దరఖాస్తుల స్వీకరణ
22–1–2025 నుంచి 31–1–2025 మెయిన్స్ పరీక్ష
12–2–2025 - ఫలితాల ప్రకటన
IBM Hiring Data Engineer Jobs: డేటా ఇంజనీర్ ఉద్యోగాలకు IBM నోటిఫికేషన్.. పూర్తి వివరాలు ఇవే
రెండో దశ మెయిన్స్
31–1–2025 నుంచి 24–2–2025 దరఖాస్తుల స్వీకరణ
1–4–2025 నుంచి 8–4–2025 మెయిన్స్ పరీక్ష
17–4–2025 - ఫలితాల ప్రకటన