Tennis: ఐటీఎఫ్‌ టోర్నీ సింగిల్స్‌లో విజేతగా నిలిచిన క్రీడాకారిణి?

అంతర్జాతీయ టెన్నిస్‌ సమాఖ్య (ఐటీఎఫ్‌) మహిళల టోర్నీలో హైదరాబాద్‌ అమ్మాయి సహజ యామలపల్లి విజేతగా అవతరించింది. మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో మార్చి 6న జరిగిన సింగిల్స్‌ ఫైనల్లో సహజ 6–5తో ఆధిక్యంలో ఉన్న దశలో ఆమె ప్రత్యర్థి, మూడో సీడ్‌ ఎమిలీ సీబోల్డ్‌ (జర్మనీ) గాయం కారణంగా వైదొలిగింది. దాంతో సహజను విజేతగా ప్రకటించారు. సహజ కెరీర్‌లో ఇదే తొలి ఐటీఎఫ్‌ సింగిల్స్‌ టైటిల్‌ కావడం విశేషం.

రన్నరప్‌ రష్మిక జంట
ఐటీఎఫ్‌ మహిళల టోర్నీలో హైదరాబాద్‌కు చెందిన సామ సాత్విక–శ్రీవల్లి రష్మిక జంట రన్నరప్‌గా నిలిచింది. మార్చి 6న జరిగిన డబుల్స్‌ ఫైనల్లో సాత్విక–రష్మిక ద్వయం 6–3, 4–6, 11–13తో ‘సూపర్‌ టైబ్రేక్‌’లో సోహా సాదిక్‌–చామర్తి సాయి సంహిత (భారత్‌) జోడీ చేతిలో పోరాడి ఓడిపోయింది.

అహిక జోడీకి రజతం
ప్రపంచ టేబుల్‌ టెన్నిస్‌ మస్కట్‌ కంటెండర్‌ టోర్నీలో తెలంగాణ అమ్మాయి ఆకుల శ్రీజ మహిళల డబుల్స్‌లో కాంస్య పతకం నెగ్గింది. ఒమన్‌ రాజధాని మస్కట్‌లో జరిగిన సెమీఫైనల్లో శ్రీజ–సెలీనా (భారత్‌) జంట 4–11, 6–11, 10–12తో సుతీర్థ–అహిక (భారత్‌) ద్వయం చేతిలో ఓడింది. ఫైనల్లో సుతీర్థ–అహిక జోడీ(భారత్‌) 6–11, 11–8, 10– 12, 7–11తో జాంగ్‌ రుయ్‌–కుయ్‌ మాన్‌ (చైనా) జంట చేతిలో ఓడి రజతం దక్కించుకుంది.

ISSF World Cup 2022: ప్రపంచకప్‌ టోర్నీలో భారత్‌కు స్వర్ణ పతకం

క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    :
అంతర్జాతీయ టెన్నిస్‌ సమాఖ్య (ఐటీఎఫ్‌) మహిళల సింగిల్స్‌లో విజేతగా నిలిచిన క్రీడాకారిణి?  
ఎప్పుడు : మార్చి 6
ఎవరు    : సహజ యామలపల్లి
ఎక్కడ    : నాగ్‌పూర్, మహారాష్ట్ర
ఎందుకు : సింగిల్స్‌ ఫైనల్లో సహజ 6–5తో ఆధిక్యంలో ఉన్న దశలో ఆమె ప్రత్యర్థి, మూడో సీడ్‌ ఎమిలీ సీబోల్డ్‌ (జర్మనీ) గాయం కారణంగా వైదొలగడంతో..

డౌన్‌లోడ్‌ చేసుకోండి: 
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్‌ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్‌) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్‌ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్‌ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్‌ చేసుకోండి.

యాప్‌ డౌన్‌లోడ్‌ ఇలా..
డౌన్‌లోడ్‌ వయా గూగుల్‌ ప్లేస్టోర్‌

#Tags