Supreme Court: మతం మారిన దళితులకు ఎస్సీ హోదాపై అధ్యయనం
మతం మారిన దళితులకు ఎస్సీ హోదా కల్పించే అంశంపై అధ్యయనానికి సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కేజీ బాలకృష్ణన్ నేతృత్వంలో కమిషన్ ను కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ విషయంలో అభిప్రాయం చెప్పాలంటూ సుప్రీంకోర్టు ఆదేశించిన నేపథ్యంలో ఈ మేరకు చర్య తీసుకుంది. కమిషన్ లో సభ్యులుగా 1981వ బ్యాచ్ హిమాచల్ ప్రదేశ్ కేడర్‌కు చెందిన రిటైర్డ్ ఐఏఎస్ అధికారి డాక్టర్ రవీందర్‌కుమార్ జైన్, యూజీసీ సభ్యురాలు ప్రొఫెసర్ సుష్మా యాదవ్‌ను నియమిస్తూ నోటిఫికేషన్ జారీచేసింది. ఈ కమిషన్ చైర్మన్ బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి రెండేళ్లలో నివేదిక సమర్పించాలని గడువు విధించింది.
>> Download Current Affairs PDFs Here
Download Sakshi Education Mobile APP
#Tags