NGRI: భూగర్భంలో జలసిరిని లెక్కించే విధానం
భూగర్భంలో వందల అడుగుల లోతున ఉండే జలాలు ఎన్ని రోజుల వరకు నీటి అవసరాలను తీర్చగలుగుతాయో తేల్చే ఇంటిగ్రేటెడ్ హైడ్రో జియోఫిజికల్ ఇన్వెస్టిగేషన్ విధానాన్ని జాతీయ భూభౌగోళిక అధ్యయన సంస్థ(ఎన్‌జీఆర్‌ఐ) అభివృద్ధి చేసింది.
దీనిద్వారా రాతి నేలల అడుగున నీటి లభ్యత, దాని పరిమాణాన్ని పక్కాగా లెక్కించడానికి వీలవుతుందని చెబుతున్నారు. ముఖ్యంగా వర్షాభావ ప్రాంతాల్లో, కేవలం బోరుబావులపై ఆధారపడి వ్యవసాయం చేసే రైతులకు లబ్ధి చేకూరేలా ఈ విధానాన్ని అందుబాటులోకి తీసుకొచ్చారు.
>> Download Current Affairs PDFs Here
Download Sakshi Education Mobile APP
#Tags