National Law Day: భార‌త‌ రాజ్యాంగ దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటారు?

భార‌త‌ రాజ్యాంగ దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం నవంబరు 26న జరుపుకుంటారు. భారత రాజ్యాంగాన్ని.. రాజ్యాంగ సభ 1949 నవంబర్ 26న ఆమోదించింది. ఈ సందర్బాన్ని పురస్కరించుకుని ప్రతి ఏటా నవంబర్ 26వ తేదీన రాజ్యాంగ దినోత్సవాన్ని జరపాలని భారత ప్రభుత్వం నిర్ణయించింది. ఈ రోజును జాతీయ న్యాయ దినోత్సవం(నేషనల్ లా డే) అని కూడా పిలుస్తారు.

1949లో భారత రాజ్యాంగ కమిటి.. రాజ్యాంగ ముసాయిదాను చేపట్టింది. కమిటీ సభ్యులు 1949 నవంబరు 26వ తేదీన తొలి ముసాయిదా ప్రతులపై సంతకాలు చేశారు. అది 1950 జనవరి 26వ తేదీ నుంచి అమల్లోకి వచ్చింది. రాజ్యాంగ మౌలిక లక్ష్యం సామాజిక, ఆర్థిక, రాజకీయ న్యాయాన్ని అందరికీ అందించడం, కాబట్టి రాజ్యాంగ ముసాయిదా ప్రతుల తొలి సంతకాల రోజైన నవంబరు 26వ తేదిని జాతీయ న్యాయదినోత్సవంగా ఎంచుకున్నారు. ఈ దినోత్సవం నాడు న్యాయవాదులు సమావేశమై న్యాయాన్ని కాపాడుతామని న్యాయ ప్రతిజ్ఞ చేస్తారు.

ప్రపంచంలో అతి పెద్దది..

భారత రాజ్యాంగం ప్రపంచంలో అతి పెద్దది. ఇది లిఖిత రూపంలో ఉంది. 1928లో మోతీలాల్ నెహ్రూ రూపొందించిన నివేదిక దీనికి మూలాధారమైంది. 75 శాతానికి పైగా పాలనాంశాలను 1935 చట్టం నుంచి స్వీకరించారు. రాజ్యాంగం అమల్లోకి వచ్చినపుడు 395 నిబంధనలు, 8 షెడ్యూళ్లు, 22 భాగాలు, 3 అనుబంధాలు, 403 పుటలతో ఉంది. రాజ్యాంగాన్ని రూపొందించడానికి రాజ్యాంగ పరిషత్‌కు 2 సంవత్సరాల 11 నెలల 18 రోజుల సమయం పట్టింది. దీని రూపకల్పనకు మొత్తం రూ. 64 లక్షల వ్యయం అయ్యింది.

చ‌ద‌వండి: ఐఎన్‌ఎస్‌ వేలా జలాంతర్గామి ఎక్కడ జలప్రవేశం చేసింది?

క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    : భార‌త‌ రాజ్యాంగ దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటారు?
ఎప్పుడు  : ప్రతి ఏటా నవంబర్ 26
ఎవరు    : భారత ప్రజలు 
ఎందుకు : భారత రాజ్యాంగాన్ని.. రాజ్యాంగ సభ 1949 నవంబర్ 26న ఆమోదించిన సందర్భంగా..

డౌన్‌లోడ్‌చేసుకోండి:
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్‌అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్‌) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్‌అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్‌యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్‌చేసుకోండి.

యాప్‌డౌన్‌లోడ్‌ఇలా...
డౌన్‌లోడ్‌వయా గూగుల్‌ప్లేస్టోర్‌

#Tags