Daily Current Affairs in Telugu: 15 డిసెంబ‌ర్‌ 2023 క‌రెంట్ అఫైర్స్

వివిధ పోటీ ప‌రీక్ష‌ల‌కు ప్రిపేర‌య్యే విద్యార్ధుల‌ కోసం సాక్షి ఎడ్యుకేష‌న్‌ అందించే డైలీ క‌రెంట్ అఫైర్స్‌.
15 december daily Current Affairs in Telugu

1. ఇజ్రాయెల్‌–పాలస్తీనా సమస్యకు శాంతియుత పరిష్కారం కనుగొనడంలో కృషి సాగిస్తున్న డేనియల్‌ బరెన్‌బోయిమ్, అలీ అబు అవ్వాద్‌లకు 2023 సంవత్సరం ఇందిరా గాంధీ శాంతి బహుమతిని ప్రకటించారు.

2. భారత్‌ మార్చితో ముగిసే ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 6.7 శాతం వృద్ధి సాధిస్తుందని ఆసియన్‌ డెవలప్‌మెంట్‌ బ్యాంక్‌ (ఏడీబీ) తాజా నివేదిక పేర్కొంది. 

Daily Current Affairs in Telugu: 14 డిసెంబ‌ర్‌ 2023 క‌రెంట్ అఫైర్స్

3. చైనాకు చెందిన 53 విదేశీ కంపెనీలు భారత్‌లో వ్యాపార కేంద్రాలు ఏర్పాటు చేసుకున్నట్టు కార్పొరేట్‌ వ్యవహారాల శాఖ వెల్లడించింది.

4. జోహన్నెస్‌బర్గ్ వేదికగా సౌతాఫ్రికాతో జరిగిన మూడో టీ20లో భారత కెప్టెన్‌ సూర్యకుమార్‌ యాదవ్‌ వేగంగా నాలుగు శతకాలు బాదిన బ్యాటర్‌గా రికార్డులకెక్కాడు.

5. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి ఎనిమిది నెలల్లో (ఏప్రిల్‌- నవంబరు) ప్రత్యక్ష పన్నుల వసూళ్లు రూ.10.64 లక్షల కోట్లుగా నమోదయ్యాయి.

Daily Current Affairs in Telugu: 13 డిసెంబ‌ర్‌ 2023 క‌రెంట్ అఫైర్స్

#Tags