Bharat Biotech: భారత్ తయారీ కోవిడ్ టీకా కోవాగ్జిన్‌ను గుర్తించిన దేశం?
భారత్‌కు చెందిన భారత్ బయోటెక్ తయారీ కోవిడ్ టీకా కోవాగ్జిన్‌ను గుర్తిస్తున్నట్లు ఆస్ట్రేలియా ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. కోవాగ్జిన్‌తోపాటు చైనాలోని సినోఫామ్ తయారుచేసిన బీబీఐబీపీ–కోర్‌వి టీకాను కూడా గుర్తిస్తున్నట్లు నవంబర్ 1న వెల్లడించింది. దీంతో కోవాగ్జిన్ తీసుకున్న 12 సంవత్సరాలు, అంతకంటే ఎక్కువ వయసున్న వారు ఇకపై ఆస్ట్రేలియా వెళ్లవచ్చు. ఆస్ట్రాజెనెకా–ఆక్స్‌ఫర్డ్ విశ్వవిద్యాలయం సంయుక్తంగా రూపొందించిన కొవిషీల్డ్‌ను ఇప్పటికే ఆ దేశం అధికారికంగా గుర్తించింది. కోవిడ్ మహమ్మారితో సరిహద్దులను మూసివేసిన ఆస్ట్రేలియా దాదాపు 20 నెలల తర్వాత మొదటిసారిగా దేశంలోకి ప్రయాణికులను అనుమతించింది.
చదవండి: ప్రధాని మోదీతో ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్ ఎక్కడ సమావేశమయ్యారు?
క్విక్ రివ్యూ :
ఏమిటి : భారత్ తయారీ కోవిడ్ టీకా కోవాగ్జిన్‌ను గుర్తించిన దేశం?
ఎప్పుడు : నవంబర్ 1
ఎవరు : ఆస్ట్రేలియా
ఎందుకు : కోవాగ్జిన్ టీకా తీసుకున్న వారిని దేశంలోని అనుమతించేందుకు...
డౌన్‌లోడ్ చేసుకోండి:
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్ చేసుకోండి.
యాప్ డౌన్‌లోడ్ ఇలా...
డౌన్‌లోడ్ వయా గూగుల్ ప్లేస్టోర్