Top 10 FAQs on CBSE Board Exams: సీబీఎస్‌ఈ బోర్డ్‌ ఎగ్జామ్స్‌.. ఫెయిల్‌ అయితే? సప్లిమెంటరీకి ఎన్నిసార్లు ఛాన్స్‌ ఉంటుంది?

సీబీఎస్‌ బోర్డ్‌ ఎగ్జామ్స్‌ త్వరలోనే ప్రారంభం కానున్నాయి. ఇప్పటికే సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) పరీక్షల షెడ్యూల్‌ను ​విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఫిబ్రవరి 15, 2025 నుంచి బోర్డ్‌ ఎగ్జామ్స్‌ మొదలవ్వనున్నాయి. ఈ క్రమంలో సాధారణంగా విద్యార్థులకు ఉండే పలు సందేహాలపై సీబీఎస్‌ఈ వివరణ ఇచ్చింది. అవేంటో తెలుసుకుందాం. 
Top 10 FAQs on CBSE Board Exams

☛ఒకవేళ థియరీ ఎగ్జామ్‌లో ఫెయిల్‌ అయితే, ప్రాక్టికల్‌ ఎగ్జామ్‌ కూడా మళ్లీ రాయాల్సి ఉంటుందా?

CBSE: లేదు.. మీరు ఒకవేళ ప్రాక్టికల్‌ పాస్‌ అయ్యి, థియరీ ఫెయిల్‌ అయినా, ప్రాక్టికల్‌ మార్కులు మీకు యాడ్‌ అవుతాయి. సో, కేవలం థియరీ ఎగ్జామ్‌ రాస్తే సరిపోతుంది. 


☛  ఏదైనా కారణాల వల్ల విద్యార్థులు ఒక ఏడాది డ్రాప్‌అవుట్‌ అయితే, తర్వాతి ఏడాది పరీక్షలకు ఎలాంటి సిలబస్‌ ఫాలో అవ్వాల్సి ఉంటుంది?

విద్యార్థి.. తాను పరీక్షకు హాజరయ్యే సంవత్సరానికి సంబంధించి నిర్దేశిత సిలబస్‌ను ఫాలో అవ్వాల్సి ఉంటుంది. ఆ సంవత్సరపు అకడమిక్‌ కరిక్యులం కోసం www.cbseacademic.nic.in ను సందర్శించండి. 

☛ 10 లేదా 12వ తరగతిలో సాధించిన మార్కుల అనంతరం విద్యార్థి ఇంప్రూవ్‌మెంట్‌ రాయడానికి వీలు ఉంటుందా?

ఉంటుంది. XIIలో ఏవైనా రెండు సబ్జెక్టులు, క్లాస్‌ Xలో ఏదైనా ఒక సబ్జెక్ట్‌లో ఇంప్రూవ్‌మెంట్‌ రాయడానికి వీలు ఉంటుంది. 

☛  10 లేదా 12వ తరగతికి చెందిన విద్యార్థులు ఎన్నిసార్లు సప్లిమెంటరీ పరీక్షలకు హాజరుకావచ్చు?

రిజల్ట్‌ వచ్చిన అనంతరం, అదే ఏడాది జులై/ఆగస్టులో ఒకసారి సప్లిమెంటరీ పరీక్షలకు హాజరుకావొచ్చు. లేదా తదుపరి సంవత్సరం ఫిబ్రవరి/మార్చి/ఏప్రిల్‌లో రెండోసారి పరీక్ష రాయొచ్చు. లేదా అదే ఏడాది జులై/ఆగస్టులో మూడోసారి పరీక్షకు హాజరుకావొచ్చు. 

☛ 12వ తరగతి పాస్‌ అవ్వాలంటే ఉండాల్సిన క్రైటీరియా ఏంటి?

స్టూడెంట్‌ ఛాయిస్‌ అయిన 5 సబ్జెక్టుల్లో పాస్‌ అవ్వాలి. దీంతో పాటు థియరీ,IA/ప్రాజెక్ట్/ప్రాక్టికల్‌లలో ఒ‍క్కో దాంట్లో 33% మార్కులు రావాలి. 

☛ విద్యార్థి తన మార్కులపై అసంతృప్తిగా ఉంటే ఎలాంటి ప్రొసీజర్‌ ఫాలో అయ్యేందుకు ఛాన్స్‌ ఉంది?

1. వెరిఫికేషన్‌
2. ఆన్సర్‌ బుక్‌ను ఫోటో కాపీ 
3. రీ- వాల్యుయేషన్‌ కోసం స్టూడెంట్స్‌ అప్లై చేసుకోవచ్చు. 


☛  రీ-వాల్యుయేషన్‌ తర్వాత మార్కులు పెరగడం/తగ్గడం ఉంటుందా?

 వెరిఫికేషన్/‌రీ-వాల్యుయేషన్ అనంతరం మార్కులు పెరగడం లేదా చాన్స్‌ ఉంటుంది. 

☛  రీవెరిఫికేషన్‌ తర్వాత కొత్తగా మారిన మార్కుల మెమో సర్టిఫికేట్‌ ఇస్తారా?

అవును.. ఒకవేళ మార్కుల్లో ఏదైనా తేడా ఉంటే కొత్త మార్క్స్‌ షీట్‌-కమ్‌-సర్టిఫికేట్‌ ఇస్తారు. 

☛ ఒకవేళ పరీక్షలో ఫెయిల్‌ అయితే, మరోసారి బోర్డ్‌ ఎగ్జామ్స్‌కి ఎలా హాజరుకావాలి?

ప్రైవేట్‌ లేదా రెగ్యులర్‌ స్టూడెంట్‌ మాదిరే హాజరుకావొచ్చు. మరింత సమాచారం కోసం www.cbse.gov.in ని సందర్శించండి.

 

#Tags