Success of Childhood Dream as IAS : నా తండ్రి చెప్పిన ఆ మాటలే.. నన్ను 'ఐఏఎస్' కొట్టేలా చేశాయ్..
మంచి చదువు చదివి ఉన్నత హోదాలో ఉండాలని చిన్నప్పటి నుంచి నాన్న చెప్పిన మాటలతోనే తాను స్ఫూర్తి పొంది కలెక్టర్ కావాలని సంకల్పించానని సివిల్స్ ఆలిండియా 200 ర్యాంకర్ కంటం మహేశ్‌కుమార్ తెలిపారు. తన తండ్రే తనకు మంచి మోటివేటర్ అన్నారు. బోధన్ పట్టణానికి చెందిన కంటం రాములు, యాదమ్మల మొదటి సంతానం మహేశ్‌కుమార్.
➤ IAS Achiever: చిన్నప్పట్టి కలను సాకారం చేసుకొని ఐఏఎస్ కు చేరింది..
వీరిది మధ్య తరగతి కుటుంబం. రాములు విద్యుత్ శాఖలో సీనియర్ లైన్‌మన్‌గా వేల్పూర్‌లో విధులు నిర్వహిస్తుండగా, యాదమ్మ జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో హెల్త్ సూపర్ వైజర్‌గా పని చేస్తున్నారు. తన ఐఏఎస్ ప్రిపరేషన్‌కు అమ్మనాన్నలతో పాటు భార్య సౌమ్య తన సహకారాన్ని అందించారని తెలిపారు. సివిల్స్‌లో ర్యాంకుతో తనకు ఫారెన్ సర్వీసెస్, ఇండియన్ అడ్మినిస్ట్రేటీవ్ సర్వీస్‌లలో ఏదోఒకటి వస్తుందని అనుకుంటున్నట్లు తెలిపారు.
➤ Collector Transfer: క్రిష్ణగిరి జిల్లా కలెక్టర్‌గా శరయు..
అనాథ పిల్లలకు ఇవ్వమనే వాడు
చిన్ననాటి నుంచి చదువులో చురుకుగా ఉండేవాడు. నవోదయలో సీటు సాధించడం ఆనందాన్ని ఇచ్చింది. ఆ ఆనందాన్ని సివిల్స్‌లో ర్యాంకు సాధించే వరకు సాగించాడు. సివిల్స్‌కు ప్రిపేర్ అవుతున్నావు. కోచింగ్ తీసుకొమ్మని అడిగితే ఆడబ్బులను అనాథ ఆశ్రమాలకు, అనాథ పిల్లలకు ఇవ్వండి అని చెప్పేవాడు. అనుకున్న లక్ష్యాన్ని సాధించి సంతోషాన్ని పంచాడు.
➤ Tenth Ranker: టెన్త్ లో ప్రథమ స్థానం.. ఆదర్శంగా యువతి
–యాదమ్మ, తల్లి
పట్టలేనంత సంతోషంగా ఉంది
నా కొడుకు సివిల్స్‌లో ర్యాంకు సాధించడం పట్టలేనంత సంతోషంగా ఉంది. విద్యపై మక్కువతో ఉన్నత విద్యను అభ్యసించాడు. చిన్ననాటి నుంచి కలెక్టర్ అవుతానని చెప్పిన మాటలను సాకారం చేశాడు.
– కంటం రాములు, తండ్రి