Skip to main content

Book: నిరుద్యోగుల కోసం సబ్సిడీతో పోటీ పరీక్షల పుస్తకం

Group Iతో పాటు ఇతర ప్రభుత్వ ఉద్యో గాల కోసం పోటీ పడుతున్న నిరుద్యోగుల కోసం రాష్ట్ర ప్రణాళికా శాఖ ఓ పుస్తకాన్ని ప్రచురించింది.
Books
నిరుద్యోగుల కోసం సబ్సిడీతో పోటీ పరీక్షల పుస్తకం

పోటీ పరీక్షలకు హాజరవుతున్న అభ్యర్థులకు సామాజిక, ఆర్థిక అంశాలపై పట్టు ఉండే విధంగా 300 పేజీలతో ‘తెలంగాణ సామాజిక, ఆర్థిక ముఖ చిత్రం – 2022’ను అందు బాటులోకి తీసుకొచ్చింది. ఇటీవలే ఈ పుస్త కాన్ని Telangana State Planning Commission ఉపాధ్యక్షుడు బి.వినోద్‌కుమార్‌ ఆవిష్కరిం చారు. నిరుద్యోగుల కోసం సబ్సిడీపై ఈ పుస్తకాన్ని అందించాలని నిర్ణయించినట్టు Planning Department డైరెక్టర్‌ ఎస్‌.కె. మీరా వెల్లడించారు. సమగ్ర వివరాలతో ఉండే ఈ పుస్తకాన్ని నిరుద్యోగుల సౌలభ్యం కోసం అన్ని జిల్లాల కలెక్టరేట్‌లలో అందు బాటులో ఉంచనున్నారు. పుస్తక ముద్రణకు ప్రభుత్వం రూ.100 సబ్సిడీ ఇస్తుండటంతో నిరుద్యోగులకు దీనిని రూ.150కు విక్రయించా లని నిర్ణయించారు. ఈ పుస్తకాలు కేవలం జిల్లా కలెక్టరేట్‌లు, Hyderabadలోని గణాంక భవన్‌ (Khairatabad)లో ఉంటాయని ప్రణాళికా శాఖ వెల్లడించింది. ఇతర వివరాల కోసం 9182607890, 8978900832 నంబర్లలో సంప్రదించాలి.

చదవండి: 

Published date : 09 Jun 2022 04:31PM

Photo Stories