TSPSC Group II: 783 గ్రూప్–2 పోస్టులు.. శాఖలవారీగా ఉద్యోగ ఖాళీలు ఇలా..
18 శాఖల్లో 783 ఉద్యోగాల భర్తీకి ఈ ప్రకటన విడుదలైంది. 2023 జనవరి 18 నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరించనున్నట్లు టీఎస్‌పీఎస్సీ ప్రకటించింది. ఫిబ్రవరి 16 సాయంత్రం 5 గంటల వరకు దరఖాస్తుల స్వీకరణ కొనసాగనుంది. అభ్యర్థుల విద్యార్హతలు, వయోపరిమితి తదితర వివరాలను కమిషన్ వెబ్‌సైట్‌లో చూడాలని టీఎస్‌పీఎస్సీ వెల్లడించింది.
చదవండి: టీఎస్‌పీఎస్సీ - స్టడీ మెటీరియల్ | బిట్ బ్యాంక్ | సక్సెస్ స్టోరీస్ | గైడెన్స్ |
ఈ ఉద్యోగ ఖాళీల్లో అత్యధికంగా సాధారణ పరిపాలన విభాగం పరిధిలో 165 అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ పోస్టులున్నాయి. ఆ తర్వాత పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ పరిధిలో 126 మండల్ పంచాయత్ ఆఫీసర్ పోస్టులు, భూ పరిపాలన శాఖలో 98 నయాబ్ తహసీల్దార్ పోస్టులున్నాయి. ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు తర్వాత రెండోసారి భర్తీ చేస్తున్న గ్రూప్–2 పోస్టుల్లో పెద్ద సంఖ్యలో ఖాళీలుండటంతో నిరుద్యోగ అభ్యర్థులు పెద్ద ఎత్తున కసరత్తు ముమ్మరం చేస్తున్నారు. ఇప్పటికే గ్రూప్–1, గ్రూప్–4 కేటగిరీలతోపాటు పలు విభాగాల్లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు జారీ చేసిన టీఎస్‌పీఎస్సీ... అతిత్వరలో గ్రూప్–3 ప్రకటన విడుదల చేసేందుకు సిద్ధమవుతోంది.
చదవండి: టీఎస్‌పీఎస్సీ - సిలబస్ | ప్రివియస్ పేపర్స్ | ఎఫ్‌ఏక్యూస్ | ఆన్‌లైన్ క్లాస్ | ఆన్‌లైన్ టెస్ట్స్ | ఏపీపీఎస్సీ
గ్రూప్–2 కేటగిరీలో శాఖలవారీగా ఉద్యోగ ఖాళీలు
పోస్టు |
ఖాళీలు |
మున్సిపల్ కమిషనర్ గ్రేడ్–3 |
11 |
అసిస్టెంట్ కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్ |
59 |
నాయబ్ తహసీల్దార్ |
98 |
సబ్ రిజిస్ట్రార్ గ్రేడ్–2 |
14 |
అసిస్టెంట్ రిజిస్ట్రార్ (కోఆపరేటివ్) |
63 |
అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ |
09 |
మండల పంచాయత్ ఆఫీసర్ |
126 |
ఎక్సైజ్ సబ్ ఇన్‌స్పెక్టర్ |
97 |
అసిస్టెంట్ డెవలప్‌మెంట్ ఆఫీసర్ (చేనేత) |
38 |
అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ (జీఏడీ) |
165 |
అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ (శాసనసభ సచివాలయం) |
15 |
అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ (ఫైనాన్స్) |
25 |
అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ (లా) |
07 |
అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ (రాష్ట్ర ఎన్నికల కమిషన్) |
02 |
డిస్ట్రిక్ట్ ప్రొబేషన్ ఆఫీసర్ గ్రేడ్–2 జువెనైల్ సర్వీస్ |
11 |
అసిస్టెంట్ బీసీ డెవలప్‌మెంట్ ఆఫీసర్ |
17 |
అసిస్టెంట్ ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్ |
09 |
అసిస్టెంట్ సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్ |
17 |
వచ్చే వారం గ్రూప్–1 మెయిన్స్ ఎంపిక జాబితా?
గ్రూప్–1 ప్రిలిమ్స్‌లో అర్హత సాధించి మెయిన్స్ పరీక్షలకు ఎంపికైన అభ్యర్థుల జాబితా వచ్చే వారంలో విడుదల చేసేందుకు టీఎస్‌పీఎస్సీ కసరత్తు చేస్తోంది. ఇప్పటికే జాబితా సిద్ధమవగా దాన్ని మరోసారి పరిశీలించి విడుదల చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. గ్రూప్–1 కేటగిరీలో మొత్తం 503 పోస్టులుండగా ఒక్కో పోస్టు కు 50 మంది చొప్పున మెయిన్స్ పరీక్షలకు అభ్యర్థులను ఎంపిక చేయనున్నట్లు టీఎస్‌పీఎస్సీ ఇప్పటికే ప్రకటించింది.