Skip to main content

SI Success Story: గ్రంథాలయంలో ప్రిపరేషన్‌.. మొదటి ప్రయత్నంలోనే కొలువు సాధించాడు

Success Story

దుగ్గొండి: మండలంలోని మల్లంపల్లి గ్రామానికి చెందిన బూర నారాయణ, శోభారాణి దంపతులది నిరుపేద కుటుంబం. కూలీకి వెళ్తేగాని పూటగడవదు. అలాంటి వారి ఇంట్లో వెలుగులు నిండాయి. ఆ దంపతుల కుమారుడు రఘుబాబు ఎస్సై పోస్టుకు ఎంపికయ్యారు. రఘుబాబు టెన్త్‌ వరకు స్థానికంగా ఉన్న ప్రభుత్వ పాఠశాలలోనే చదివాడు. మాసాబ్‌టాంక్‌లోని ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కళాశాలలో డిప్లొమా చేశాడు. బీటెక్‌ చదవడానికి డబ్బు సరిపడలేదు. దీంతో ఓపెన్‌ డిగ్రీ చేశాడు. ఈ సమయంలోనే మండల కేంద్రంలోని గ్రంఽఽథాలయంలో చదువుకునే వాడు. ఎస్సై కావాలనే పట్టుదలతో ముందుకు సాగి మొదటి ప్రయత్నంలోనే కొలువు సాధించాడు. ఎస్‌పీఎఫ్‌ విభాగంలోఎస్సై ఉద్యోగం సాధించాడు. దీంతో నిరుపేద ఇంట్లో వెలుగు నిండింది. ఊరంతా సంబురాలు చేసుకుంది.

TS SI Final Selection list 2023 : ఎస్సై ఫలితాలు విడుదల.. పురుషులు, మహిళల ఎంపిక ఇలా.. తుది ఎంపిక జాబితా ఇదే..

Published date : 08 Aug 2023 04:06PM

Photo Stories