Skip to main content

TSLPRB: పోలీస్‌ తుది ఫలితాల విడుదల

సాక్షి, హైదరాబాద్‌: యూనిఫాం సర్వీసెస్‌ కొలువుల భర్తీలో భాగంగా వివిధ విభాగాల్లోని ఎస్సై, కానిస్టేబుల్‌ పోస్టులకు నిర్వహించిన తుది రాత పరీక్షల ఫలితాలను టీఎస్‌ఎల్పీఆర్బీ ప్రకటించింది.
TSLPRB
పోలీస్‌ తుది ఫలితాల విడుదల

అన్ని పోస్టులకు కలిపి తుది రాత పరీక్షకు హాజరైన వారిలో 84.06 శాతం మంది అర్హత సాధించారు. అభ్యర్థులు తమ ఓఎంఆర్‌ షీట్లను మే 30 నుంచి వెబ్‌సైట్‌లో చూసుకోవచ్చు. ఈ మేరకు బోర్డు చైర్మన్‌ వీవీ శ్రీనివాసరావు మే 30న ఓ ప్రకటన విడుదల చేశారు. అభ్యర్థులు  ఠీఠీఠీ.్టట pటb.జీn వెబ్‌సైట్‌లో లాగిన్‌ ఐడీ ద్వారా తమ ఓఎంఆర్‌ షీట్లతోపాటు ఫైనల్‌ కీలు సైతం చూ­సుకోవచ్చని ఆయన తెలిపారు. ఏవైనా ఇబ్బందులుంటే 9393711110, 939100­5006 నంబర్లలో లేదా  www.tslprb.in ఈ మెయిల్‌ ఐడీలో సంప్రదించాలని సూచించారు.

 TS Constable Final Written Exam Results 2023 

3 వరకు రీవెరిఫికేషన్‌ గడువు  

తుది ఓఎంఆర్‌ షీట్లలో ఏవైనా అనుమానాలున్నా, మా­ర్కుల లెక్కింపులో అనుమానాలున్నా అభ్యర్థులు రీకౌంటింగ్, లేదా రీవెరిఫికేషన్‌కు దరఖాస్తు చేసుకునేందుకు జూన్‌ 1 నుంచి 3వ తేదీ రాత్రి 8 గంటల వరకు అవకాశం ఉంటుంది. 

చదవండి: Inspirational Success Story : కడుపులో బిడ్డ ఉండగానే భర్త మరణం.. ఎన్నో క‌ష్టాల‌ను ఎదుర్కొని నా బిడ్డ‌ను ఎస్సై చేశానిలా.. కానీ..

ఎడిటింగ్‌కు అవకాశం 

తుది రాత పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థుల్లో ఎవరైన వివరాల నమోదులో పొరపాట్లు చేసి ఉంటే, వారికి ఎడిట్‌ ఆప్షన్‌ ఇవ్వనున్నట్టు శ్రీనివాసరావు చెప్పారు. ఇప్పటికే బోర్డును అభ్యర్థించిన వారికి కులం, వయసు, లోకల్‌ క్యాండిడేచర్, ఎక్స్‌–సర్వీస్‌మెన్‌ స్టేటస్, అకడమిక్‌ విద్యార్హతల్లో తప్పులను సరిచేసుకునేందుకు సర్టిఫికెట్‌ వెరిఫికేషన్‌ సమయంలో అవకాశం కల్పిస్తామన్నారు. 

చదవండి: Telangana History Quiz in Telugu: మీర్‌ ఉస్మాన్‌ అలీ ఖాన్‌ ఏ సంవత్సరంలో 'రాజ్‌ ప్రముఖ్‌'గా నియమితులయ్యారు?

వివిధ విభాగాల్లో పోస్టుల వారీగా తుది రాత పరీక్ష ఫలితాలు 

పోస్టు     

హాజరైనవారు       

అర్హులు  

అర్హుల శాతం

సివిల్‌ పీసీ, ట్రాన్స్‌పోర్ట్, ఎక్సైజ్‌ కానిస్టేబుల్‌

1,08,055

98,218

90.90

సివిల్‌ ఎస్సై

57,848

43,708

75.56

కమ్యూనికేషన్‌ కానిస్టేబుల్‌

6,098

4,564

74.84

కమ్యూనికేషన్‌ ఎస్సై

3,115

729

23.40

పీసీ డ్రైవర్‌

1,987

1,779

89.53

ఫింగర్‌ ఫ్రింట్‌ బ్యూరో ఏఎస్సై

1,487

1,153

77.54

పీటీఓ ఎస్సై

579

463

79.97

పీసీ మెకానిక్‌

290

238

82.07

మొత్తం

1,79,459

1,50,852

84.06 

Published date : 31 May 2023 03:17PM

Photo Stories