Jenya Events 2023-24: విద్యార్థులకు సృజనాత్మకత ముఖ్యం
జనవరి 5న మండల పరిధిలోని తోల్‌కట్ట సమీపంలో గల చేవెళ్ల గురుకుల పాఠశాలలో జెన్య ఈవెంట్స్ 2023–24, జెన్య ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో నిర్వహించిన సైన్స్ ఫెయిర్, రంగోళి కార్యక్రమానికి ఆమె హాజరయ్యారు.
విద్యార్థులు బోధన, అభ్యాసన పరికరాల ద్వారా తరగతి గదుల్లో చేసిన కృత్యాలను ప్రదర్శించారు. ఈ సందర్భంగా డాక్టర్ శారదావెంకటేష్ మాట్లాడుతూ.. విద్యార్థులు చేసిన సైన్స్ నమునాలు, రంగోళి ఎంతో చక్కగా ఉన్నాయన్నారు.
చదవండి: ప్రతిభ కనబర్చి ప్రతిష్టాత్మకమైన రాజ్యపురస్కార్ అవార్డు పొందిన విద్యార్థులకు అభినందన
విద్యార్థులలో సృజనాత్మకత పెరుగుతుందని ఆలోచనలతో పాటు విజ్ఞానాన్ని పెంపొందించుకోవాలన్నారు. ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా విద్యార్థులకు విజ్ఞానం పెంపొందుతుందన్నారు. అనంతరం బహుమతులు ప్రదానం చేశారు.
కార్యక్రమంలో మండల విద్యాధికారి అక్బర్, పాఠశాల ప్రిన్సిపాల్ రమాదేవి, ప్రధానోపాధ్యాయుడు నర్సింహ, ఉపాధ్యాయుడు దర్శన్, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.