Skip to main content

Success Story of a Strong Women Pilot: చేతులు లేని ఈ యువ‌తి పైలెట్ గా విజ‌యం

ఎంతో మంది చిన్న చిన్న గాయాల‌కే వెనుకబ‌డుతూ ఉంటారు. కొంద‌రు ల‌క్ష్యం కోసం ఎంతైనా కృషి చేస్తారు. ఇటువంటి వాళ్ళలోనే ఒక‌రు ఈ యువ‌తి. పుట్టుక‌తోనే లోపంతో పుట్టినా, త‌ను సాధించిన విజ‌యానికి మాత్రం ఎటువంటి లోపం లేకుండా ముందుకెళ్ళింది.
Jessica Cox from America born with no hands
Jessica Cox from America born with no hands

శరీరంలో ఏదైనా ఒక అవయవ లోపం ఉంటేనే  కృంగిపోతారు చాలామంది. కానీ  కొందరు మాత్రం ఎలాంటి  లోపం ఉన్నా దాన్ని చాలెంజ్‌గా స్వీకరిస్తారు. అలా రెండు చేతులు లేకపోయినా పైలట్‌గా రాణిస్తోంది ఈ యువ‌తి. ఈ యువ‌తి పేరు జెస్సికా కాక్స్, త‌న చేతుల‌ను కోల్పోయినా కూడా త‌మ కృషితో పైలట్‌గా లైసెన్స్ సంపాదించి, లోపంలో కూడా త‌మ ప్ర‌యాణంలో విజ‌యం సాధించిన‌ తొలి మ‌హిళ‌గా చ‌రిత్ర సృష్టించింది. అమేరికాకు చెందిన ఈ వండ‌ర్ వుమెన్ అన్న పేరు సంపాదించిన జెస్సికా కాక్స్ గురించి, ఆమె గెలుపు గురించి వివ‌రంగా తెలుసుకుందాం..

APPSC Group 1 Ranker Inspirational Story : ప్రాణాపాయం నుంచి భ‌య‌టప‌డ్డానిలా.. ఎన్నో వివ‌క్ష‌త‌లు ఎదుర్కొంటూనే గ్రూప్‌-1 ఉద్యోగం కొట్టానిలా.. కానీ..

అరిజోనాలోని సియెర్రా విస్టాలో 1983లో జన్మించిన జెస్సికాకు అరుదైన జ‌న‌నం కార‌ణంగా పుట్టుక‌తోనే త‌న రెండు చేతుల‌ను కోల్పోయింది. ఎంత బాధ‌లో ఉన్న కూడా ఆమె తల్లిదండ్ర‌లు త‌మ బిడ్డ కోసం ఏమాత్రం కృంగించ‌లేదు. ధైర్యంగా ప్ర‌పంచాన్ని ఎదురుకొని త‌మ కూతురికి కూడా ధైర్యాన్ని ఇచ్చారు. త‌న‌కు త‌మ తల్లిదండ్ర‌లు తోడు ఉంది అన్న ధైర్యంతో త‌ను ఏమాత్రం బాధ ప‌డ‌కుండా ఎన్ని క‌ష్టాలు, ఓట‌ములు ఎదురైనా కృంగించాలేదు. నిరుత్సాహ ప‌డ‌కుండా త‌న కాళ్ళ‌నే చేతుగా మార్చుకుంది. కొంత కాలానికి తాను కృత్రిమ చేతుల‌ను కూడా ధ‌రించింది. కాని, త‌క్కువ స‌మ‌యంలోనే వాటిని కూడా తొల‌గించింది. త‌న ధైర్యంతో ముంద‌డుగు వేస్తూ, త‌న చిన్న త‌నంలోనే త‌ను నివ‌సిస్తున్న ప‌ట్ట‌ణంలోనే నృత్యం నేర్చుకుంది. అలా 14 సంవ‌త్స‌రాల పాటు సాగించింది.

women pilot

Women Success as Entrepreneur: యువ‌తి పారిశ్రామిక‌వేత్త‌గా పొందిన పుర‌స్కారం

త‌ను చ‌దువుకుంటూనే త‌న నృత్యాన్ని అభ్యాసిస్తూనే ఉంది. జెస్సికా యునైటెడ్ స్టేట్స్‌లోని అరిజోనా విశ్వవిద్యాలయం నుండి మనస్తత్వశాస్త్రంలో డిగ్రీ పూర్తి చేసింది. ఇలాగే కొన‌సాగుతుండ‌గా, 22 ఏళ్ల వయసులో పైలెట్‌గా శిక్షణ పొందింది. లెట్‌గా కూడా శిక్షణ పొందింది. ఈ శిక్ష‌ణ‌లు పొందిన కేవలం మూడు సంవత్సరాల్లో పైలెట్‌గా పూర్తి చేసింది. అక్క‌డికే ఆగ‌కుండా ఈత కొట్టడం,కారు డ్రైవింగ్ చేయడం, విమానం నడపడంలో ప్రావీణ్యంతో పాటు గొప్ప గౌర‌వాన్ని సంపాదించుకుంది.

2008 అక్టోబరు 10న  జెస్సికా తన పైలట్ సర్టిఫికేట్‌ను పొందింది. ఆమె 10,000 అడుగుల ఎత్తులో తేలికపాటి క్రీడా విమానాన్ని నడిపేందుకు అర్హత పొందింది. 2004లో, జెస్సికా మొదటిసారిగా రైట్ ఫ్లైట్ ద్వారా సింగిల్ ఇంజిన్ విమానాన్ని నడిపింది. రెండు ముఖ్యమైన అవయవాలు లేనప్పటికీ  టైక్వాండోలో రెండు బ్లాక్ బెల్ట్‌లను కూడా సంపాదించింది. 2019లో, కాక్స్ నాల్గవ డిగ్రీ బ్లాక్ బెల్ట్ సాధించింది. అమెరికన్ టైక్వాండో అసోసియేషన్‌లో బ్లాక్ బెల్ట్ సంపాదించిన చేతులు లేని తొలి వ్యక్తిగా పేరు సంపాదించింది.

UPSC Civils Ranker Tharun Patnaik Story : ఎలాంటి కోచింగ్ లేకుండానే.. వ‌రుస‌గా రెండు సార్లు సివిల్స్ కొట్టానిలా..

success and inspiring women

జెస్సికా కాక్స్ సాధించిన విజ‌యాలు, పుర‌స్కారాలు.

♦ బ్రాండ్‌లారేట్ ఇంటర్నేషనల్ బ్రాండ్ పర్సనాలిటీ అవార్డును పొంది అరుదైన గౌర‌వాన్ని ద‌క్కించుకుంది.
♦ AOPA LIVE పైలట్స్ ఛాయిస్ అవార్డ్ 2010: జెస్సికా ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా వీక్షించబడిన మహిళా ఏవియేటర్‌గా మారింది.
♦ ఫిలిపినో ఉమెన్స్ నెట్‌వర్క్: 2009లో అమెరికాలో టాప్ 100 అత్యంత ప్రభావవంతమైన ఫిలిపినో మహిళల  జాబితాలో చోటు దక్కించుకుంది.
♦ ది సక్సెస్ స్టోరీ జెస్సికా కాక్స్ 2009లో రిప్లీస్ బిలీవ్ ఇట్ ఆర్ నాట్‌లో   కూడా పబ్లిష్‌ అయింది. 
♦ ఫిలిపినో అమెరికన్ జర్నల్ అవార్డ్ ఆఫ్ ఎక్సలెన్స్, 2008లో అత్యుత్తమ ఫిలిపినో అవార్డు లభించింది.
♦ ‘వైకల్యం అంటే అసమర్థత కాదు" అని రైట్‌ఫుటెడ్ ఫౌండేషన్ ఇంటర్నేషనల్  మిషన్‌ను ప్రచారం చేయడానికి తాను విమానాన్ని ఉపయోగిస్తానని ఆమె పేర్కొంది
♦ 2015లో కాక్స్ తన జీవితంలో నేర్చుకున్న పాఠం ద్వారా సొంత‌ సవాళ్లను అధిగమించడానికి ప్రజలను ప్రేరేపించేలా డిసార్మ్ యువర్ లిమిట్స్ అనే  పుస్తకాన్ని రచించారు.

Published date : 23 Sep 2023 11:11AM

Photo Stories