Skip to main content

CM Overseas Scholarship: విదేశీ విద్యారుణాలకు దరఖాస్తుల స్వీకరణ

భూపాలపల్లి అర్బన్‌: జిల్లాలో మైనార్టీ విద్యార్థుల నుంచి విదేశీ విద్యారుణాలకు దరఖాస్తులను స్వీకరిస్తున్నట్లు జిల్లా ఇన్‌చార్జ్‌ మైనార్టీ అభివృద్ధి అధికారిని బుర్ర సునీత ఆగ‌స్టు 23న‌ ఒక ప్రకటనలో తెలిపారు.
CM Overseas Scholarship
విదేశీ విద్యారుణాలకు దరఖాస్తుల స్వీకరణ

 విదేశీ విద్య చదవాలనుకునే విద్యార్థులు చీఫ్‌ మినిస్టర్‌ ఓవర్సీ స్‌ స్కాలర్‌షిప్‌ ద్వారా విదేశీ విద్యాలయాల్లో పీజీ డాక్టరేట్‌ కోర్సుల విద్యను అభ్యసించే వారికి ఉపకార వేతనాలు అందించడం జరుగుతుందన్నారు. అర్హత ఉన్న మైనారిటీ విద్యార్థు ల నుంచి దరఖాస్తులను స్వీకరిస్తున్నామని, ఈ ఏడాది జనవరి 2023 నుంచి జూలై 2023 నెలలో విదేశీ విద్యాలయాల్లో ప్రవేశం పొందిన విద్యార్థులు తెలంగాణఈపాస్‌. వెబ్‌సైట్‌లో సెప్టెంబ‌ర్‌ 9వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలన్నారు.

చదవండి:

అమెరికాలో.. ఉన్న‌త విద్య‌ను అభ్య‌సించాల‌నుకుంటున్నారా..? మీ సందేహాల‌కు.. స‌మాధానాలు.. ఇప్పుడే..?

Foreign Education: విదేశీ విద్యానిధికి డాలర్ రూట్.. ఉన్నత విద్య కోసం భారీ వ్యయం

Published date : 24 Aug 2023 03:15PM

Photo Stories