Skip to main content

Kaushal Competitions 2023: పాఠ‌శాల విద్యార్థుల‌కు కౌశ‌ల్ పోటీలు

విద్యార్థుల‌కు ఏటా నిర్వ‌హించే కౌశ‌ల్ పోటీలను ఈ ఏడాది న‌వంబ‌ర్ లో మొద‌లు కానుంద‌ని డీఈఓ ప్ర‌క‌టించారు. ఈ నేప‌థ్యంలో విద్యార్ధుల‌కు నిర్వ‌హించే పోటీలు వివిధ స్థాయిలో జ‌రుగుతాయ‌ని తెలిపారు. పోటీల పోస్ట‌ర్ ఆవిశ్క‌ర‌ణ‌లో ఆమె పూర్తి వివ‌రాల‌ను వెల్ల‌డించారు..
Students for Kaushal 2023 competitions
Students for Kaushal 2023 competitions

సాక్షి ఎడ్యుకేష‌న్: భారతీయ విద్యామండలి, ఆప్‌కాస్ట్‌ సంయుక్త ఆధ్వర్యంలో ప్రభుత్వ ఉన్నత పాఠశాలల విద్యార్థులకు ఏటా నిర్వహించే కౌశల్‌– 2023 పోటీలు నవంబర్‌ 21వ తేదీ నుంచి జరుగుతా యని డీఈఓ సి.వి.రేణుక తెలిపారు. పోటీల పోస్టర్లను ఆమె తన కార్యాలయంలో మంగళవారం ఆవిష్కరించారు. ఎనిమిది, తొమ్మిది, పది తరగతుల విద్యార్థులకు గణితం, సైన్స్‌, సోషల్‌. విజ్ఞాన శాస్త్ర రంగాల్లో భారతీయుల కృషి అంశంపై పాఠశాల, జిల్లా, రాష్ట్ర స్థాయి పోటీలు ఉంటాయని పేర్కొన్నారు. ఎనిమిది, తొమ్మిది, పది తరగతుల విద్యార్థులకు సైన్స్‌ క్విజ్‌, ఎనిమిది, తొమ్మిది విద్యార్థులకు పోస్టర్‌ ప్రజెంటేషన్‌ పోటీలు జరుగుతాయన్నారు.

Uttarakhand Cultural Fest: జాతీయ‌స్థాయి ఫెస్ట్‌లో ఏక‌ల‌వ్య విద్యార్థి

పాఠశాల స్థాయిలో నవంబర్‌ 21, 22, 23 తేదీల్లో, డిసెంబర్‌ ఎనిమిదో తేదీన జిల్లా స్థాయిలో, డిసెంబర్‌ 29, 30 తేదీల్లో రాష్ట్ర స్థాయి పోటీలు జరుగుతాయని వివరించారు. ప్రధానోపాధ్యాయులు భారతీయ విద్యా మండలి వెబ్‌సైట్‌లో తమ విద్యార్థుల వివరాలను నమోదు చేయాలని సూచించారు. ఉపవిద్యాశాఖాధికారి కె.వి.ఎన్‌.కుమార్‌, కౌశల్‌ జిల్లా కోఆర్డినేటర్‌ ఎ.కృష్ణమోహనరావు, ఏపీయూఎస్‌ రాష్ట్ర సభ్యుడు పేరూరి సతీష్‌కుమార్‌, కౌశల్‌ కోఆర్డినేటర్‌ ఎ.వి.వి.ప్రసాద్‌బాబు పాల్గొన్నారు.

Published date : 11 Oct 2023 05:24PM

Photo Stories