Skip to main content

1st Class Admission New Rule 2024-25 : 1వ త‌ర‌గ‌తి అడ్మిషన్‌కు ఈ నిబంధన వ‌ర్తించ‌దు.. కానీ..

సాక్షి ఎడ్యుకేష‌న్‌ : కేంద్ర విద్యాశాఖ ప్రకటించిన 1వ త‌ర‌గ‌తికి 6 సంవ‌త్స‌రాల ఉండాల్సిందే అనే.. నిబంధన తెలంగాణ‌లో ఈ ఏడాది అమలు చేయడం లేదని రాష్ట్ర విద్యాశాఖ కార్యదర్శి బుర్రా వెంకటేశం వెల్లడించారు.
Centre asks states to fix 6 years as minimum age for Class 1 admission

ఈ ఏడాది కూడా గతంలో కొనసాగిన నిబంధనలే కొనసాగుతాయని ఆయ‌న‌ తెలిపారు. కేంద్ర విద్యాశాఖ ప్రకటించిన ఆరేండ్ల నిబంధనను తెలంగాణ సహా ఏడు రాష్ట్రాలు అమలు చేయడం లేదని తెలిపారు. దీని అమలుకు సమస్యలున్న నేపథ్యంలో మరింత సమయం కోరినట్టు చెప్పారు.

☛ TS 10th Class Fail Students 2024 : టెన్త్ ప‌రీక్ష‌ల్లో ఫెయిలైన విద్యార్థుల‌కు మ‌రో చాన్స్‌.. రీకౌంటింగ్, రీవెరిఫికేషన్, మీ ఆన్స‌ర్ షీట్ కోసం..

అన్ని స్కూళ్లలో చిన్నారుల అడ్మిషన్ల పై కేంద్ర ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసిన విష‌యం తెల్సిందే. ఇకపై ఆరేళ్లు నిండిన చిన్నారులకే 1వ తరగతిలో ప్రవేశాలు కల్పించాలని కేంద్ర విద్యాశాఖ పేర్కొంది. నూతన నూతన విద్యావిధానంలో భాగంగా పిల్లలకు 1వ తరగతి అడ్మిషన్‌పై కేంద్రం కీలక సూచనలు చేసింది. ఆరేళ్లు నిండితేనే చిన్నారులకు ఒకటవ తరగతిలో అడ్మిషన్‌ ఇవ్వాలని సూచించింది. 

ఆరేళ్ల వయసు తప్పనిసరి..
వచ్చే విద్యా సంవత్సరం 2024-25 నుంచే ఈ విధానాన్ని అమలు చేయాలని పేర్కొంది. నేషనల్‌ ఎడ్యుకేషన్‌ పాలసీ-2020, రైట్‌ టు ఎడ్యుకేషన్‌ యాక్ట్‌-2009 కింద 1వ తరగతిలో చేరే పిల్లలకు ఆరేళ్ల వయసు తప్పనిసరి చేస్తూ కేంద్ర విద్యాశాఖ నిర్ణయం తీసుకుంది. అలాగే 3 ఏళ్లు ప్రీ స్కూల్‌ ఎడ్యుకేషన్‌, తర్వాత 2 ఏళ్లు ప్రాథమిక విద్యలో తొలిదశ అయిన 1, 2వ తరగతులు ఉంటాయి. ప్రీ స్కూల్‌ నుంచి 2వ తరగతి వరకు పిల్లలకు ఎలాంటి అవాంతరాలు లేని అభ్యాస పద్ధతిని ప్రోత్సహించాలనేదే ఈ విధానం ముఖ్య ఉద్దేశమని కేంద్రం తన లేఖలో పేర్కొంది.

☛ Good News : వీరికి ఉచితంగా 2 లక్షలు అందిస్తున్న కేంద్రం.. ఎలా అంటే..?

ప్రీ-స్కూల్‌ నుంచి రెండో తరగతి వరకు..
మూడేళ్ల వయసులో పిల్లలను పాఠశాలకు పంపడం వల్ల మంచి పునాది పడటంతో ప్రీ-స్కూల్‌ నుంచి రెండో తరగతి వరకు చిన్నారుల్లో లెర్నింగ్‌ ప్రక్రియ అలవడుతుందని తెలిపింది. అంగన్‌వాడీలు, ప్రభుత్వ/ప్రభుత్వ ఎయిడెడ్‌, ప్రయివేటు, ఎన్జీవో సంస్థల ఆధ్వర్యంలో నడిచే ప్రీస్కూళ్లలో అభ్యసిస్తున్న చిన్నారులందరికీ ఒకటో తరగతిలో చేరడానికి ముందే నాణ్యమైన విద్యను మూడేళ్ల పాటు అందించేందుకు ఈ విధానం దోహదపడుతుందని కేంద్రం ఉద్దేశం. నూతన విద్యా విధానానికి అనుగుణంగా ఆయా రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల్లో ఉన్న వయసు నిబంధనను సర్దుబాటు చేసేలా చర్యలు తీసుకోవాలని కేంద్రం ఆదేశించింది.

Published date : 01 May 2024 05:29PM

Photo Stories