Schools: బడిఈడు పిల్లలు పాఠశాలలో ఉండాలి
Sakshi Education
ఆదోని సెంట్రల్: బడిఈడు పిల్లలు పాఠశాలలో ఉండాలని జిల్లా విద్యాశాఖాధికారి రంగారెడ్డి అన్నారు. శనివారం పట్టణంలో ప్రభుత్వ బాలికల పాఠశాల, పురపాలక ఉన్నత పాఠశాలల్లో విద్యార్థులకు అందిస్తున్న భోజనం, బోధనా సామర్థ్యాలను ఆయన పరిశీలించారు. జిల్లాలో 700 మంది విద్యార్థులు డ్రాపౌట్స్ అయినట్లు తెలిపారు. ఆదోని నియోజకవర్గంలో 99 మంది విద్యార్థులు డ్రాపౌట్స్ కాగా 48 మందిని తిరిగి పాఠశాలల్లో చేర్పించామన్నారు. మిగిలిన వారిని కూడా పాఠశాలల్లో చేర్పించేందుకు ప్రధానోపాధ్యాయుల నుంచి ఉపాధ్యాయులు కృషి చేయాలన్నారు. డీఈఓ వెంట మండల విధ్యాధికారి–2 శ్రీనివాసులు, ప్రధానోపాధ్యాయులు మల్లికార్జున, అలిసిద్దిఖీ ఉన్నారు.
చదవండి: Tenth Exams: యూడైస్‌లో పేరుంటేనే 'పది' పరీక్షలకు అనుమతి
Published date : 30 Oct 2023 05:11PM