Skip to main content

Pratibha Awards 2023: అక్షర సేవా సమితి ఆధ్వర్యంలో ప్రతిభా పురస్కారాలు...

విద్యార్థులు ప్రేర‌ణ పొందేందుకు, వాళ్ళు అన్ని రంగాల్లో ముందుకు వెళ్ళేందుకు, పిల్ల‌ల్లో ప్రోత్సాహాన్ని నింపేందుకు గాను విద్యార్థుల‌కు ప్ర‌తిభా పుర‌స్కారాల‌ను అంద‌జేయాల‌ని కురి శివ‌మూర్తి తెలిపుతూ విద్యార్థుల‌ను మ‌రింత ప్రోత్స‌హించారు.
students honoured with pratibha awards
students honoured with pratibha awards

సాక్షి: విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికి తీసేందుకు ప్రతిభా పురస్కారాలు ఎంతో దోహదపడుతాయని నగర కాంగ్రెస్‌ నేత కురి శివమూర్తి తెలిపారు. ఆదివారం తాలూకాలోని మరియమ్మనహళ్లిలో నెరవినకై గళు, అక్షర సేవా సమితి ఆధ్వర్యంలో పది, పీయూసీ విద్యార్థులకు ఏర్పాటు చేసిన ప్రతిభా పురస్కారాలు కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు.

Best Teacher Awards 2023: ఉత్తమ ఉపాధ్యాయులుగా రాష్ట్రం నుంచి ఇద్దరు

విద్యార్థులు విద్యావంతులై అన్ని రంగాల్లో ముందుకు రావాలన్నారు. సమాజంలోని అనేక సంఘ సంస్థలు ప్రతిభావంతులకు అన్ని విధాలా సహకారం అందించాలని కోరారు. అనంతరం విద్యార్థులకు ప్రశస్తి పత్రాలు, మోమెంటోలను అందించి సన్మానించారు.
 

Published date : 28 Aug 2023 02:08PM

Photo Stories