DEO B Bhikshapati: విద్యార్థుల్లో సృజనాత్మకతను వెలికితీయాలి
తొలిమెట్టు కార్యక్రమంపై చిట్యాలలోని జెడ్పీహెచ్‌ఎస్, మునుగోడు ఎమ్మార్సీ, నార్కట్‌పల్లిలో జరుగుతున్న ఫౌండేషనల్ లిటరసీ అండ్ న్యూమరసీ(ఎఫ్‌ఎల్‌ఎన్)శిక్షణను ఆగస్టు 3న ఆయన పరిశీలించి మాట్లాడారు. శిక్షణ పొందడం వల్ల ప్రతి ఉపాధ్యాయుడు.. విద్యార్థులకు అర్థమయ్యే రీతిలో పాఠ్యాంశాలు బోధించవచ్చన్నారు.
చదవండి: Padma Basavanthappa, IAS: స్కూళ్లు, అంగన్‌వాడీల్లో తనిఖీ
ప్రభుత్వ పాఠశాలలపై నమ్మకం కలిగించేలా బోధించాలన్నారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులకు పలు సూచనలు చేశారు.
చిట్యాలలో జరిగిన కార్యక్రమంలో ఎఫ్‌ఎల్‌ఎన్ కోర్సు ఇన్‌చార్జి డైరెక్టర్ గోగికార్ మాధవి, రిసోర్స్ పర్సన్స్ బొప్పని యాదయ్య, మర్యాద అశోక్‌రెడ్డి, ఐఈఆర్‌పీ బోయ శ్రీనివాస్, సీఆర్‌పీ జయకాంత్, జాన్, ప్రవళిక, వరలక్ష్మి, మునుగోడులో కోర్స్ డైరెక్టర్ టి.యాదయ్య, డీఆర్‌పీ తుల శ్రీనివాస్, ఎమ్మార్పీలు సయ్యద్ యూసుఫ్‌పాష, నాగేశ్వరావు, పారిజాత, రవికుమార్, దివ్య, నర్సింహ, సతీష్, నాగరాజు, పీఆర్‌సీలు సైదులు, నర్సింహ, సతీష్, నాగరాజు, నార్కట్‌పల్లిలో కోర్స్ డైరెక్టరు కాశయ్య, కోర్సు ఇన్‌చార్జి కవిత, ఆర్‌పీ కృష్ణారెడ్డి, రామచంద్రారెడ్డి, సీసీఓ బాజా మురళి, సీఆర్‌పీ నాగమణి, ఎంఈఎస్ ఆస్మా తదితరులు పాల్గొన్నారు.
చదవండి: AISF: విద్యారంగ సమస్యలపై పోరాటం