ITBP Recruitment: 293 హెడ్‌కానిస్టేబుల్, కానిస్టేబుల్ పోస్టులు.. ఎవరు అర్హులంటే..
ఇండో–టిబెటన్ బోర్డర్ పోలీస్ ఫోర్సు(ఐటీబీపీ) గ్రూప్ సి నాన్–గెజిటెడ్(నాన్ మినిస్టీరియల్) విభాగంలో.. హెడ్ కానిస్టేబుల్(టెలికమ్యూనికేషన్), కానిస్టేబుల్ (టెలికమ్యూనికేషన్) పోస్టుల భర్తీకి పురుష, మహిళా అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 293
పోస్టుల వివరాలు: హెడ్ కానిస్టేబుల్(టెలికమ్యూనికేషన్)–126(పురుషులు–107, మహిళలు–19); కానిస్టేబుల్(టెలికమ్యూనికేషన్)–167(పురుషులు–142, మహిళలు–25).
అర్హతలు: హెడ్ కానిస్టేబుల్ పోస్టులకు 12వ తరగతి(ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్) లేదా టీఐ(ఎలక్ట్రానిక్స్/ఎలక్ట్రికల్/కంప్యూటర్)/డిప్లొమా(ఎలక్ట్రానిక్స్/కమ్యూనికేషన్ /ఇన్‌స్ట్రుమెంటేషన్/కంప్యూటర్ సైన్స్/ఐటీ/ఎలక్ట్రికల్). కానిస్టేబుల్ పోస్టులకు మెట్రిక్యులేషన్ ఉత్తీర్ణులై ఉండాలి.
వయసు: 30.11.2022 నాటికి హెడ్‌కానిస్టేబుల్ పోస్టులకు 18–25ఏళ్లు, కానిస్టేబుల్ పోస్టులకు 18–23ఏళ్ల మధ్య ఉండాలి.
వేతనం: హెడ్ కానిస్టేబుల్ పోస్టులకు రూ.25,500 నుంచి రూ.81,100; కానిస్టేబుల్ పోస్టులకు రూ.21,700 నుంచి రూ.69,100 ఉంటుంది.
ఎంపిక విధానం: ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్, ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్, డాక్యుమెంటేషన్, రాతపరీక్ష, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఎంపికచేస్తారు.
ముఖ్య సమాచారం
- దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
- ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభతేది: 01.11.2022
- ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరితేది: 30.11.2022
- వెబ్‌సైట్: https://itbpolice.nic.in
చదవండి: SSB Recruitment 2022: సశస్త్ర సీమాబల్‌లో 399 కానిస్టేబుల్ పోస్టులు.. పూర్తి వివరాలు ఇవే..
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
Qualification | 12TH |
Last Date | November 30,2022 |
Experience | Fresher job |
For more details, | Click here |