Skip to main content

VAHA Jobs: వీఏహెచ్‌ఏ పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల..!

ఉద్యోగావకాశం కోసం వీఏహెచ్‌ఏ వారు ఒక ప్రకటన విడుదల చేశారు. అక్కడ ఖాళీ ఉన్న పోస్టులకు భర్తీ చేసేందుకు ఉండాల్సిన అర్హతల గురించి కూడా వెల్లడించారు.
VAHA Recruitment   Apply Now  403 Vacant Posts for Village Animal Husbandry Assistants    Qualifications for Village Animal Husbandry Assistant Positions   Recruitments for VAHA in AP  Animal Husbandry Department Announcement

సాక్షి ఎడ్యుకేషన్‌: విలేజ్‌ అనిమల్‌ హస్బెండరీ అసిస్టెంట్స్‌ (వీఏహెచ్‌ఏ) పోస్టుల భర్తీ ప్రక్రియలో భాగంగా ఉమ్మడి జిల్లా పరిధిలో 403 పోస్టులు ఖాళీ ఉన్నట్లు పశుసంవర్ధక శాఖ అధికారులు ప్రకటించారు. ఈ మేరకు శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు. వీఏహెచ్‌ఏ పరీక్షల తరువాత రెండు విడతలుగా 442 మంది అభ్యర్థుల సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌ పూర్తి చేశారు.

Academic Officer: విద్యార్థుల మార్కులను పరిశీలించిన మానిటరింగ్‌ అధికారి..

ఆ తరువాత ఇప్పటికే పనిచేస్తున్న వీఏహెచ్‌ఏల బదిలీలో 171 మందికి ఉత్తర్వులు ఇచ్చారు. వచ్చేవారం కొత్త పోస్టుల భర్తీ కోసం జిల్లా వ్యాప్తంగా 403 పోస్టులు ఖాళీలు ఉన్నట్లు ప్రకటించారు. అందులో అత్యధికంగా ఉరవకొండ డివిజన్‌లో 139 పోస్టులు, అనంతపురం డివిజన్‌లో 120, పెనుకొండ డివిజన్‌లో 59, ధర్మవరం డివిజన్‌లో 57, హిందూపురం డివిజన్‌లో 28 పోస్టులు ఖాళీ ఉన్నట్లు తెలిపారు.

Published date : 05 Feb 2024 08:10AM

Photo Stories