FCI Recruitment: 5043 కేటగిరి3 నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల.. దరఖాస్తు చివరి తేదీ ఇదే..
న్యూఢిల్లీలోని ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా.. దేశవ్యాప్తంగా విస్తరించి ఉన్న ఎఫ్‌సీఐ డిపోలు, కార్యాలయాల్లో జోన్ల వారీగా కేటగిరి3 నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 5043
పోస్టుల వివరాలు: జూనియర్ ఇంజనీర్(సివిల్ ఇంజనీరింగ్), జూనియర్ ఇంజనీర్(ఎలక్ట్రికల్ మెకానికల్ ఇంజనీరింగ్), స్టెనోగ్రాఫర్ గ్రేడ్2, అసిస్టెంట్ గ్రేడ్3(జనరల్), అసిస్టెంట్ గ్రేడ్3(అకౌంట్స్), అసిస్టెంట్ గ్రేడ్3(టెక్నికల్), అసిస్టెంట్ గ్రేడ్3(డిపో), అసిస్టెంట్ గ్రేడ్3(హిందీ).
జోన్ల వారీగా ఖాళీలు: నార్త్ జోన్2388, సౌత్ జోన్989, ఈస్ట్ జోన్768, వెస్ట్ జోన్713, నార్త్ ఈస్ట్ జోన్185.
అర్హత: పోస్టును అనుసరించి డిగ్రీ, బీకాం, బీఎస్సీ(అగ్రికల్చర్/బోటనీ/జువాలజీ/బయోటెక్నాలజీ/బయోకెమిస్ట్రీ/మైక్రోబయాలజీ/ఫుడ్ సైన్స్), బీఈ/బీటెక్(ఫుడ్ సైన్స్/ఫుడ్‌సైన్స్ అండ్ టెక్నాలజీ/అగ్రికల్చరల్ ఇంజనీరింగ్/బయెటెక్నాలజీ /సివిల్), డిప్లొమా(సివిల్/మెకానికల్)/ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్) ఉత్తీర్ణులై ఉండాలి.
చదవండి: ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ గ్రేడ్ III పోస్టుల పరీక్షా సరళి 2022
ఎంపిక విధానం: ఆన్‌లైన్ పరీక్ష(ఫేజ్1, ఫేజ్2 పరీక్షలు), స్కిల్/టైపింగ్ టెస్ట్(స్టెనో పోస్టులకు) ఆధారంగా ఎంపికచేస్తారు.
ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో ఫేజ్1 పరీక్షా కేంద్రాలు: నెల్లూరు, విజయవాడ, కాకినాడ, కర్నూలు, తిరుపతి, విజయనగరం, విశాఖపట్నం, రాజమండ్రి, ఏలూరు, హైదరాబాద్, కరీంనగర్, వరంగల్.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.
ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభ తేది: 06.09.2022
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరితేది: 05.10.2022
ఆన్‌లైన్ పరీక్ష తేది: జనవరి 2023.
వెబ్‌సైట్: https://fci.gov.in
చదవండి: TSPSC Notification 2022: 181 ఎక్స్‌టెన్షన్ ఆఫీసర్ పోస్టులు.. పూర్తి వివరాలు ఇవే..
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
Qualification | GRADUATE |
Last Date | October 05,2022 |
Experience | Fresher job |
For more details, | Click here |