Skip to main content

JNTU Anantapur: సెప్టెంబర్‌ 20 నుంచి ఫ్యాకల్టీ డెవలప్‌మెంట్‌ ప్రోగ్రాం

faculty development program from September 20th

అనంతపురం: జేఎన్‌టీయూ అనంతపురం, సెవెన్‌ హిల్స్‌ ఆఫ్‌ ఫార్మసీ (తిరుపతి) కళాశాల సంయుక్తంగా సెప్టెంబర్‌ 20 నుంచి 24 వరకు ఫ్యాకల్టీ డెవలప్‌మెంట్‌ ప్రోగ్రాం నిర్వహిస్తున్నారు. తిరుపతిలో జరుగుతున్న ఈ ప్రోగ్రాంకు జేఎన్‌టీయూ అనంతపురం వీసీ ప్రొఫెసర్‌ జింకా రంగజనార్దన ముఖ్యఅతిథిగా హాజరై కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. ప్రోగ్రాం డైరెక్టర్‌గా జేఎన్‌టీయూ అనంతపురం ప్రొఫెసర్‌ బి.ఈశ్వర్‌ రెడ్డి, కార్యక్రమానికి విశిష్ట అతిథులుగా ప్రొఫెసర్‌ ఎం.విజయకుమార్‌, ప్రొఫెసర్‌ సి. శశిధర్‌ హాజరుకానున్నారు. ప్రోగ్రాంకు హాజరుకావాలని ఆసక్తి ఉన్న అభ్యర్థులు జేఎన్‌టీయూ అనంతపురం వెబ్‌సైట్‌ను సందర్శించొచ్చు.

చ‌ద‌వండి: Smart Teaching: స్మార్ట్‌ బోధనపై అవగాహన అవసరం

Published date : 01 Sep 2023 03:25PM

Photo Stories