Indian Army Recruitment 2022: ఇండియన్ ఆర్మీలో 191 పోస్టులు.. పూర్తి వివరాలు ఇవే..
చెన్నైలోని ఆఫీసర్స్ ట్రెయినింగ్ అకాడమీ(ఓటీపీ)ఏప్రిల్ 2023 సంవత్సరానికి గాను 60వ షార్ట్ సర్వీస్ కమిషన్(టెక్) మెన్, 31వ షార్ట్ సర్వీస్ కమిషన్(టెక్) ఉమెన్ కోర్సు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ అయిన అవివాహిత పురుషులు, మహిళలు, డిఫెన్స్ పర్సనల్ విడోస్ నుంచి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 191
ఖాళీల వివరాలు: షార్ట్ సర్వీస్ కమిషన్(టెక్)మెన్–175, ఎస్‌ఎస్‌సీ(టెక్) ఉమెన్–14, విడోస్ డిఫెన్స్ పర్సనల్–02.
విభాగాలు: సివిల్/బిల్డింగ్ కన్‌స్ట్రక్షన్ టెక్నాలజీ, ఆర్కిటెక్చర్, మెకానికల్, ఎలక్ట్రికల్/ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్ సైన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, టెలీకమ్యూనికేషన్ తదితరాలు.
అర్హత: ఎస్‌ఎస్‌సీ(టెక్)మెన్/ఉమెన్–సంబంధిత సబ్జెక్టుల్లో ఇంజనీరింగ్ డిగ్రీ, ఎస్‌ఎస్‌సీ విడోస్(నాన్ టెక్నికల్)(నాన్ యూపీఎస్సీ)–ఏదైనా గ్రాడ్యుయేషన్, ఎస్‌ఎస్‌సీ విడో(టెక్నికల్)–బీఈ/బీటెక్ ఉత్తీర్ణులవ్వాలి.
వయసు: ఎస్‌ఎస్‌సీ(టెక్)మెన్/ఉమెన్–01.04.2023 నాటికి 20–27 ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్‌ఎస్‌సీ విడోస్(నాన్ టెక్నికల్) (నాన్ యూపీఎస్సీ), ఎస్‌ఎస్‌సీ విడో(టెక్నికల్)–01.04.2023 నాటికి 35 ఏళ్లు మించకుండా ఉండాలి.
ఎంపిక విధానం: చివరి సెమిస్టర్/ఏడాదిలో సాధించిన మెరిట్ మార్కుల ఆధారంగా అభ్యర్థుల్ని షార్ట్‌లిస్ట్ చేస్తారు. షార్ట్‌లిస్ట్ చేసిన అభ్యర్థుల్ని ఎస్‌ఎస్‌బీ ఇంటర్వ్యూ, మెడికల్ టెస్ట్ ఆధారంగా ఎంపికచేస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేది: 24.08.2022
వెబ్‌సైట్: https://joinindianarmy.nic.in
చదవండి: Indian Army Recruitment 2022: భారత సైన్యంలో 30 డెంటల్ కార్ప్స్ పోస్టులు.. ఎవరు అర్హులంటే
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
Qualification | GRADUATE |
Last Date | August 24,2022 |
Experience | Fresher job |
For more details, | Click here |