Skip to main content

Indian Army Jobs 2023: ఆర్మీలో కొలువుతోపాటు బీటెక్‌

ఇంటర్‌ ఉత్తీర్ణులు ఆర్మీలో లెఫ్టినెంట్‌ ఉద్యోగంతోపాటు బీటెక్‌ పట్టా అందుకునే చక్కటి అవకాశం. ఇంటర్‌ ఎంపీసీ విద్యార్థుల కోసం ఇండియన్‌ ఆర్మీ 10+2 టెక్నికల్‌ ఎంట్రీ స్కీమ్‌కు నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఎంపిక ప్రక్రియలో విజయం సాధించిన వారిని శిక్షణ కోసం తీసుకుంటారు. ఈ శిక్షణను విజయవంతంగా పూర్తి చేసుకున్న అభ్యర్థులకు ఇటు బీటెక్‌ డిగ్రీతోపాటు అటు ఆర్మీలో లెఫ్టినెంట్‌ కొలువు సొంతమవుతుంది. ఇండియన్‌ ఆర్మీ 10+2 టెక్నికల్‌ ఎంట్రీ స్కీమ్‌ పూర్తి వివరాలు..
Indian Army Jobs 2023
  • మొత్తం ఖాళీల సంఖ్య 90
  • ఇంటర్‌ ఎంపీసీ విద్యార్థులకు చక్కటి అవకాశం
  • ఎంపికైతే నెలకు రూ.లక్ష వరకూ వేతనం

మొత్తం ఖాళీలు: 90

అర్హతలు

  • ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమేటిక్స్‌ సబ్జెక్టులతో 60 శాతం మార్కులతో ఇంటర్‌ ఉత్తీర్ణులై ఉండాలి. జేఈఈ మెయిన్‌ స్కోరు తప్పనిసరి. అవివాహిత పురుష అభ్యర్థులు మాత్రమే దరఖాస్తుకు అర్హులు.
  • వయసు: 16 1/2 ఏళ్ల నుంచి 19 1/2 ఏళ్ల మధ్య ఉండాలి. 2004 జూలై 2-2007 జూలై 1 మధ్య జన్మించిన వారు మాత్రమే దరఖాస్తుకు అర్హులు. 

ఎంపిక ఇలా
ఇంటర్‌ మార్కులు, జేఈఈ మెయిన్‌ స్కోర్‌ ఆధారంగా షార్ట్‌లిస్ట్‌ చేస్తారు. ఇలా ఎంపికైన వారికి సర్వీస్‌ సెలక్షన్‌ బోర్డు(ఎస్‌ఎస్‌బీ) ఆధ్వర్యంలో బెంగళూరులో అయిదు రోజుల పాటు రెండు దశల్లో సైకాలజికల్‌ టెస్టులు, గ్రూప్‌ టాస్క్‌లు, ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు. మొదటి రోజు స్టేజ్‌-1 స్క్రీనింగ్‌(ఇంటెలిజెన్స్‌) పరీక్షల్లో అర్హత సాధించిన వారిని స్టేజ్‌-2కి ఎంపిక చేస్తారు. నాలుగు రోజుల పాటు నిర్వహించే వివిధ పరీక్షల్లో.. అన్ని విభాగాల్లోనూ రాణించిన అభ్యర్థులను శిక్షణకు ఎంపిక చేస్తారు.

చ‌ద‌వండి: Naval Dockyard Recruitment 2023: నావల్‌ డాక్‌యార్డ్‌లో 281 అప్రెంటిస్‌లు

శిక్షణ
ఎంపికైన వారికి మొత్తం అయిదేళ్ల శిక్షణ ఉంటుంది. ఇందులో ఏడాది పాటు ఆఫీసర్‌ ట్రైనింగ్‌ అకాడమీ-గయాలో బేసిక్‌ మిలిటరీ ట్రైనింగ్‌ నిర్వహిస్తారు. అనంతరం నాలుగేళ్లపాటు టెక్నికల్‌ ట్రైనింగ్‌ పుణె, సికింద్రాబాద్, మావ్‌ల్లోని ఆర్మీ కేంద్రాల్లో ఏదో ఒకచోట కొనసాగుతుంది. ఇందులో రెండు దశలు..ఫేజ్‌-1 మూడేళ్ల ప్రీ కమిషన్‌ ట్రైనింగ్, ఫేజ్‌-2 ఏడాది పోస్ట్‌ కమిషన్‌ ట్రైనింగ్‌ ఉంటాయి. మూడేళ్ల ఫేజ్‌-1 శిక్షణ అనంతరం అభ్యర్థులకు నెలకు రూ.56,100 చొప్పున స్టైపెండ్‌  లభిస్తుంది.

బీటెక్‌ డిగ్రీ
నాలుగేళ్ల శిక్షణ అనంతరం లెఫ్టినెంట్‌ హోదా సొంతమవుతుంది. ట్రైనింగ్, కోర్సు పూర్తయిన తర్వాత వీరికి ఇంజనీరింగ్‌(బీటెక్‌) డిగ్రీని జవహర్‌లాల్‌ నెహ్రూ యూనివర్సిటీ ప్రధానం చేస్తుంది. అనంతరం వీరిని పూర్తిస్థాయిలో విధుల్లోకి తీసుకుంటారు.

వేతనాలు
లెఫ్టినెంట్‌ హోదాతో విధుల్లో చేరిన వారికి లెవల్‌-10 ప్రకారం మూలవేతనం లభిస్తుంది. ఇలా ఎంపికైన వారికి ప్రతి నెల రూ.56,100తోపాటు మిలటరీ సర్వీస్‌ పే కింద రూ.15,500 ప్రతి నెల అందుతాయి. వీటికి అదనంగా డీఏ, హెచ్‌ఆర్‌ఎ, ప్రోత్సాహకాలు దక్కుతాయి. విధుల్లో చేరిన మొదటి నెల నుంచే అన్ని కలుపుకొని సీటీసీ రూపంలో నెలకు దాదాపు రూ.లక్ష అందుకోవచ్చు.

చ‌ద‌వండి: AFCAT 2023 Notification: వాయుసేనలో 276 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల.. ఎంపిక ప్రక్రియ, పరీక్ష విధానం, సిలబస్‌ ఇదే..

ఉన్నత హోదా
ఈ పోస్టులకు ఎంపికైన వారు  తక్కువ వ్యవధిలోనే ఉన్నత స్థాయికి చేరుకోవచ్చు. విధుల్లో చేరిన రెండేళ్ల తర్వాత కెప్టెన్, ఆరేళ్ల సర్వీస్‌తో మేజర్, పదమూడేళ్ల అనుభవంతో లెఫ్టినెంట్‌ కల్నల్‌ హోదాలను అందుకోవచ్చు.

ముఖ్యసమాచారం

  • దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
  • ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేదీ: జూన్‌ 30, 2023
  • వెబ్‌సైట్‌: https://joinindianarmy.nic.in/
Qualification 12TH
Last Date June 30,2023
Experience Fresher job
For more details, Click here

Photo Stories