Skip to main content

JEE Mains 2024 Session 2 Exam Dates: జేఈఈ మెయిన్స్‌ సెషన్‌-2 ప్రవేశ పరీక్ష షెడ్యూల్‌ విడుద‌ల‌

సాక్షి, హైదరాబాద్‌: కేంద్ర ఇంజనీరింగ్‌ కాలేజీల్లో ప్రవేశానికి నిర్వహించే ఉమ్మ డి ప్రవేశ పరీక్ష (జేఈఈ మెయిన్స్‌–2) తేదీలను నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ (ఎన్‌టీఏ) ప్రకటించింది.
JEE Mains 2024 Session 2 Exam Dates  released

పేపర్‌–1 (బీఈ, బీటెక్‌) ఏప్రిల్‌ 4, 5, 6, 8, 9 తేదీల్లో నిర్వహిస్తున్నట్లు మార్చి 28న‌ ఓ ప్రకటనలో వెల్లడించింది. పేపర్‌–2 (బీఆర్క్, బీప్లానింగ్‌)ను ఏప్రిల్‌ 12న నిర్వహిస్తున్నట్లు తెలిపింది.

పరీక్ష ఉదయం 9 నుంచి 12 గంటల వరకు, మళ్లీ రెండో పరీక్ష సాయంత్రం 3 నుంచి 6 గంటల వరకూ ఉంటుందని వెల్లడించింది. దేశవ్యాప్తంగా 319 కేంద్రాల్లో పరీక్ష నిర్వహించనున్నట్లు తెలిపింది. 

చదవండి: జేఈఈ (మెయిన్స్‌ & అడ్వాన్స్‌డ్‌) - గైడెన్స్ | వీడియోస్

JEE Mains Topper Interview: ఆ స్ట్రాటజీతో టాప్‌ స్కోర్‌ చేశాను, నా షెడ్యూల్‌ ఇదే..

Published date : 29 Mar 2024 02:24PM

Photo Stories