Pancard : మీ పాన్ కార్డ్ పోయిందా..! అయితే వెంటనే ఇలా చేయండి..!
బ్యాంకుల్లో ఎక్కువ లావాదేవీలను జరిపే వారికి పాన్‌కార్డ్ అనేది తప్పనిసరి. దురదృష్టవశాత్తు మీ పాన్‌కార్డు పోతే బాధపడకండి. పాన్‌కార్డును ఆన్‌లైన్‌లో తిరిగి పొందవచ్చును. మీ పాన్ కార్డును పోగొట్టుకున్నట్లయితే, పాన్ కార్డులను జారీ చేసే నేషనల్ సెక్యూరిటీస్ డిపాజిటరీ లిమిటెడ్ (ఎన్‌ఎస్‌డీఎల్) అధికారిక వెబ్‌సైట్ నుంచి పాన్‌కార్డును మరల పొందవచ్చును. ఏదైనా అత్యవసర పని కోసం మీకు మీ పాన్ కార్డ్ అవసరమైతే, మీరు కేవలం ఎలక్ట్రానిక్ పాన్ కార్డ్ లేదా ఈ-పాన్ డౌన్‌లోడ్ చేసుకోనే సౌకర్యాన్ని ఎన్‌ఎస్‌డీఎల్ కల్పిస్తోంది.
ఆన్‌లైన్‌లో ఈ-పాన్‌ను పొందండిలా..
స్టెప్1: ఆన్‌లైన్‌లో ఈ-పాన్ కార్డును డౌన్‌లోడ్ చేయడానికి, మీరు యుటిఐ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ టెక్నాలజీ అండ్ సర్వీసెస్ లిమిటెడ్ https://www.utiitsl.com/ అధికారిక వెబ్‌సైట్‌కు సందర్శించండి.
స్టెప్ 2: అందులో 'పాన్ కార్డ్ సర్వీసెస్ ' ఆప్షన్‌ను ఎంచుకోండి.
స్టెప్ 3: క్లిక్ చేశాక మీరు మరో వెబ్‌పేజీకి మళ్ళించబడతారు. అందులో 'డౌన్‌లోడ్ ఇ-పాన్' పై క్లిక్ చేయండి.
స్టెప్ 4: తరువాత వచ్చే వెబ్‌పేజీలో మీ పాన్ కార్డ్ వివరాలను నమోదు చేయాలి.
స్టెప్ 5: మీ పుట్టిన తేదీ వంటి మీ వ్యక్తిగత సమాచారాన్ని నమోదు చేయాలి. మీరు మీ GSTIN నంబర్‌ను కూడా నమోదు చేయవచ్చు.
స్టెప్ 6: క్యాప్చా వివరాలను సబ్మిట్ చేసి మీ వివరాలను ధృవీకరించండి.
స్టెప్ 7: ఇప్పుడు, మీరు మీ ఇమెయిల్ ఐడి మరియు రిజిస్టర్డ్ ఫోన్ నంబర్‌పై లింక్‌ను అందుకుంటారు
స్టెప్ 8: ఇప్పుడు మీరు మీ ఈ మెయిల్ ఐడి, రిజిస్టర్డ్ ఫోన్ నంబర్‌పై లింక్ వస్తుంది. మీ ఈ మెయిల్ ఐడి, రిజిస్టర్డ్ ఫోన్ నంబర్‌ను ధృవీకరించడానికి ఓటీపీ వస్తోంది. ఓటీపీని ఎంటర్‌చేయాలి. ఓటీపీ ఎంటర్ చేసిన తరువాత మీ ఈ-పాన్ కార్డు డౌన్‌లోడ్ అవుతుంది.
గమనిక: మీరు మీ ఈ- పాన్‌కార్డును పొందాలంటే కచ్చితంగా మీ ఫోన్ పాన్‌కార్డుతో రిజిస్టరై ఉండాలి. అధికారిక వెబ్‌సైట్ నుంచి మీరు నెలకు మూడుసార్లు మాత్రమే ఈ-పాన్‌ను పొందుతారు.
Aadhar Card Address Change : ఆన్‌లైన్‌లోనే..ఆధార్ కార్డు అడ్రస్ మార్చుకోండిలా..
Aadhar card update : మీ ఇంట్లో నుంచే ఈ లింక్ ద్వారా ఆధార్ కార్డు అప్‌డేట్ చేసుకోండిలా..