Skip to main content

China Spy Balloons: భార‌త్ మీదుగా ప్ర‌యాణించిన బెలూన్‌.. అయినా ప‌స‌గ‌ట్ట‌లేక‌పోయాం... అమెరికానే హ‌డ‌లెచ్చింది.. చివ‌రికి

నిఘా బెలూన్లతో అగ్రరాజ్యాన్ని హడలెత్తించిన చైనా(China).. మరిన్ని దేశాలను లక్ష్యంగా చేసుకుందనే సమాచారం ఇప్పుడు ఆందోళన రేకెత్తిస్తోంది.

భారత్‌తో పాటు జపాన్(Japan), వియత్నాం, తైవాన్, ఫిలిప్పైన్స్‌.. ఇలా మరికొన్ని దేశాలపైనా సర్వేయిలెన్స్‌ బెలూన్‌లను ప్రయోగించిందని, ఆర్మీకి చెందిన కీలక సమాచారాన్ని సేకరించే యత్నం చేసిందనే కథనాలు వెలువడుతున్నాయి. 
హైనాన్‌ ప్రావిన్స్‌ నుంచి....
ప్రముఖ వార్తా ప్రచురణ సంస్థ ది వాషింగ్టన్‌  పోస్ట్‌(Washington post) కథనం ప్రకారం.. చైనా దక్షిణ తీరంలోని హైనాన్‌ ప్రావిన్స్‌ నుంచి నిఘా బెలూన్‌(Spy Balloons)ల ప్రయత్నం కొనసాగిందని.. జపాన్, భారతదేశం(India), వియత్నాం, తైవాన్, ఫిలిప్పీన్స్‌తో సహా పలు దేశాల సైనిక సమాచారాన్ని సేకరించే ప్రయత్నం జరిగిందని ఆ కథనం పేర్కొంది. ఇందుకు సంబంధించి పలువురు నిఘా అధికారులు, భద్రతా విభాగానికి చెందిన ప్రముఖుల నుంచి అభిప్రాయాలను సేకరించి.. ప్రచురించింది ఆ కథనం. ఈ పరిణామంపై భారత్‌ నుంచి స్పందన రావాల్సి ఉంది.

చ‌ద‌వండి: సాక్షిఎడ్యుకేష‌న్‌తో షేర్‌ చేసుకోండి... క్యాంపస్‌ జర్నలిస్టులుగా ఎద‌గండి
హెచ్చరికలు జారీ....
ఇదిలా ఉంటే.. వాషింగ్టన్‌ పోస్ట్‌ కథనానికి కొనసాగింపుగా.. అమెరికా(United States) భద్రతా అధికారులు భారత్‌ సహా మిత్ర దేశాలను చైనా నిఘా బెలూన్ల విషయంలో అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేశారు. ఈ మేరకు తాజాగా యుద్ధ విమానాల ద్వారా చైనా నిఘా బెలూన్లను కూల్చేసిన విషయాన్ని..  అట్లాంటిక్‌ మహాసముద్రం నుంచి ఆ బెలూన్ల శకలాలను సేకరించిన విషయాన్ని సైతం మిత్ర దేశాలకు నివేదించింది అమెరికా. గత మూడు రోజులుగా 40 మిత్ర దేశాలకు చెందిన భద్రతా ప్రతినిధులు, దౌత్యవేత్తలతో పెంటగాన్‌ అధికారులు ‘చైనా నిఘా బెలూన్ల వ్యవహారం’పై చర్చలు జరుపుతున్నట్లు సమాచారం.

చ‌ద‌వండి: శిథిలాల కిందే చిన్నారికి జననం... బిడ్డను కనులారా చూడకుండానే...!
ఐదు ఖండాల్లో వీటి ఉనికి...
సర్వేయలెన్స్‌ ఎయిర్‌షిప్స్‌గా భావిస్తున్న ఈ బెలూన్లు.. చైనా ఆర్మీ(పీపుల్స్‌ లిబరేషన్‌ ఆర్మీ) ద్వారానే ప్రయోగించబడుతున్నాయని, ఐదు ఖండాల్లో వీటి ఉనికి గుర్తించినట్లు అమెరికా భద్రతా అధికారులు చెబుతున్నారు. ఇది ఇతర దేశాల సౌభ్రాతృత్వానికి విఘాతం కలిగించడేనన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది. చైనా మాత్రం అవి శాటిలైట్‌ సంబంధిత ఎయిర్‌షిప్స్‌ తప్ప.. నిఘాకు సంబంధించినవి కాదని వాదిస్తోంది. పేలిన శకలాలను ఎట్టి పరిస్థితుల్లో చైనాకు అప్పగించబోమని అమెరికా అధ్యక్షుడు బైడెన్‌ స్పష్టం చేశారు. గత వారం రోజులుగా.. హవాయి, ఫ్లోరిడా, టెక్సాస్, గువాం ప్రాంతాల్లో చైనా బెలూన్లు దర్శనమిచ్చిన సంగతి తెలిసిందే.

Published date : 08 Feb 2023 05:24PM

Photo Stories