ఇన్సూరెన్స్ కోర్సును అందించే ఇన్‌స్టిట్యూట్‌లు, ఉద్యోగావకాశాల గురించి వివరించండి?
- రాహుల్, విజయవాడ
Question
ఇన్సూరెన్స్ కోర్సును అందించే ఇన్‌స్టిట్యూట్‌లు, ఉద్యోగావకాశాల గురించి వివరించండి?
Which Institutes offers Insurance Courses in India, Job Opportunities in Insurance Sector in India
ఇన్సూరెన్స్ కోర్సును అందించే ఇన్‌స్టిట్యూట్‌లు చాలానే ఉన్నాయి. దీని అధ్యయనం ద్వారా ఇన్సూరెన్స్ బిజినెస్‌పై అవగాహన వస్తుంది. ఇన్సూరెన్స్ రంగంలో రిస్క్‌ల గురించి తెలిపే శాస్త్రమే.. యాక్చూరియల్ సైన్స్.
యాక్చూరియల్ సైన్స్ అండ్ ఇన్సూరెన్స్‌ను అందించే ఇన్‌స్టిట్యూట్‌ల వివరాలు:
హైదరాబాద్‌లోని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇన్సూరెన్స్ అండ్ రిస్క్ మేనేజ్‌మెంట్.. పలు డిప్లొమా కోర్సులను అందిస్తోంది. లైఫ్ ఇన్సూరెన్స్, జనరల్ ఇన్సూరెన్స్, రిస్క్ మేనేజ్‌మెంట్‌లలో ఇంటర్నేషనల్ పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమాలను అందిస్తోంది. యాక్చూరియల్ సైన్స్‌లో పీజీ డిప్లొమాను అందిస్తోంది.
అర్హత: ఏదైనా డిగ్రీ. దీనికి ఇంజనీరింగ్ విద్యార్థులు కూడా అర్హులే. ఎంబీఏ లేదా సీఏ/ సీఎంఏ/సీఎస్ విద్యార్థులు కూడా ఈ కోర్సు చేసేందుకు అర్హులు.
ప్రవేశం: దరఖాస్తు చేసుకోవడం ద్వారా.
వెబ్‌సైట్: www.iirmworld.org.in
హైదరాబాద్‌లోని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్‌ప్రైజ్... ఇన్సూరెన్స్ స్పెషలైజేషన్‌తో మేనేజ్‌మెంట్‌లో పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమాను అందిస్తోంది.
అర్హత: కనీసం 50 శాతం మార్కులతో ఏదైనా డిగ్రీ.
ప్రవేశం: ప్రవేశపరీక్ష, గ్రూప్ డిస్కషన్, ఇంటర్వ్యూల్లో ఉత్తీర్ణత ఆధారంగా.
వెబ్‌సైట్: www.ipeindia.org
ఉద్యోగావకాశాలు: ఇన్సూరెన్స్ కంపెనీలు, ఫైనాన్షియల్ మేనేజ్‌మెంట్ కంపెనీలు, బ్యాంకులు, బిజినెస్ కన్సల్టెంట్స్ వంటి వాటిలో ఉద్యోగాలు పొందవచ్చు.